»Kavitha Petition Hearing At Supreme Court 27th Of March
Supreme court twist:కవిత పిటిషన్ విచారణ తేదీ మార్పు
Supreme court twist:ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే మూడుసార్లు.. దాదాపుగా 30 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. మొన్న (21వ తేదీన) కవితను విచారించి.. పంపించారు. తదుపరి విచారణ ఎప్పుడో తెలియజేయలేదు. అరగంటలో మెయిల్ చేస్తారనే వార్తలు వినిపించాయి. దీంతో కవిత అండ్ కో..హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.
ఈడీ (ed) అధికారులు మహిళా హక్కులను కాలరాస్తున్నారని కవిత (kavtiha) తన పిటిషన్లో పేర్కొన్నారు. తనను రాత్రి 8 గంటల వరకు ఈడీ (ed) కార్యాలయంలో కూర్చొబెట్టడంపై సుప్రీంకోర్టు (supreme court) దృష్టికి తీసుకెళ్లారు. సూర్యాస్తమయం తర్వాత మహిళను విచారణ కోసం కార్యాలయంలో ఉంచకూడదని చట్టం చెబుతోందని కవిత (kavitha) తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి ప్రతీగా ఈడీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ శుక్రవారం కాకుండా.. సోమవారం రావడంతో ఏం జరుగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు సందేహాం పడుతున్నారు.
ఈ గ్యాప్లో మళ్లీ ఈడీ నుంచి నోటీసులు రావడం.. విచారణకు పిలుస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ సారి పిలిస్తే.. ఇక అరెస్టే అనే భయం కూడా ఉంది. అందుకోసమే ఆ పార్టీ నేతల్లో భయం వ్యక్తమవుతోంది. కవిత (kavitha) ఢిల్లీ (delhi) వెళ్లిన ప్రతీసారి మంత్రులు కేటీఆర్ (ktr), హరీశ్ రావు (harish rao), శ్రీనివాస్ యాదవ్ (srinivas yadav) ఇతర ముఖ్యనేతలు వెళ్లారు. ఆ వెంటనే హైదరాబాద్ (hyderabad) వచ్చిన సంగతి తెలిసిందే.