AP: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున మంత్రి లోకేష్ రెండు రోజులపాటు ప్రచారం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన పాట్నా వెళ్లనున్నారు. సాయంత్రం బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనాలను వారికి వివరిస్తారు. తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రేపు ఉదయం ప్రచారం చేస్తారు.