అమెరికా సీఐఏ మాజీ అధికారి రిచర్డ్ బార్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లోని కహుతా న్యూక్లియర్ సెంటర్ పై కోవర్ట్ ఆపరేషన్ కు గతంలో ప్రతిపాదనలు చేశామని ఆయన తెలిపారు. అయితే అందుకు ఇజ్రాయెల్ అంగీకరించగా, భారత నాటి ప్రధాని ఇందిరా గాంధీ అంగీకారం తెలపలేదని రిచర్డ్ వెల్లడించారు. ఆ ఆపరేషన్ జరిగి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించేదని తేల్చిచెప్పారు.