BDK: మణుగూరు మండలం బ్రహ్మంగారి గుట్ట ప్రాంతానికి చెందిన పాయం రమేష్ అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మేము సైతం మిత్రమండలి సభ్యులు రమేష్ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడంలో సంతృప్తి ఉందని తెలిపారు.