KMM: ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ -2025 ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన మేర గన్ని బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతిపాదనలు పంపిన 48 గంటల లోపు కొనుగోలు కేంద్రాలకు గన్ని సంచులు సరఫరా చేస్తున్నామని ఇవాళ ప్రకటించారు.