»Telangana High Court Permission Bjps Dharna In Telangana Indira Park Hyderabad March 25th 2023
BJP: తెలంగాణలో బీజేపీ ధర్నాకు హైకోర్టు పర్మిషన్
తెలంగాణలో రేపు(మార్చి 25న) నిర్వహించనున్న బీజేపీ(BJP) మహా ధర్నాకు హైకోర్టు(telangana High Court) అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిరసనలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని వెల్లడించింది.
తెలంగాణలో రేపు(మార్చి 25న) నిర్వహించనున్న బీజేపీ(BJP) మహా ధర్నాకు హైకోర్టు(telangana High Court) అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిరసనలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని వెల్లడించింది. మరోవైపు ధర్నాలో భాగంగా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయోద్దని తెలిపింది. అయితే ముందుగా ఈ మహా ధర్నాకు పోలీసులు(police) పర్మిషన్ ఇవ్వకపోవడంతో బీజేపీ హైకోర్టుకు వెళ్లింది.
విచారణ చేపట్టిన ధర్మాసనం నిబంధలనతో కూడిన మహాధర్నాకు అనుమతి ఇచ్చింది. అయితే బీజేపీ ప్రధానంగా ఈ ధర్నాలో TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరసన తెలుపనుంది. ఈ ధర్నా హైదరాబాద్(hyderabad) ఇందిరా పార్క్(indira park) వద్ద చేయనున్నారు.