»Telangana High Court Notices To Director Raghavendra Rao
Telangana High Court: టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ బంజారాహిల్స్ సమీపంలోని షేక్‌పేట్‌లో అత్యంత విలువైన రెండెకరాల భూమి కేటాయింపులో నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై టాలీవుడ్ సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో పాటు మరికొందరికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
సినిమాలు చేయకపోయినా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో చంద్రబాబు పోస్టింగ్‌లు వైరల్‌గా మారాయి. రాఘవేంద్రరావు టీడీపీకి మద్దతుగా ట్వీట్లు చేసి లోకేష్ పిలుపునిచ్చిన నిరసనల్లో పాల్గొని సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు రాఘవేంద్రరావు కూడా కోర్టు కేసులతో వార్తల్లో నిలిచారు. తెలంగాణ హైకోర్టు(telangana High Court) ఆయనకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని విలువైన భూమికి సంబంధించి కోర్టు కేసులు ఎదుర్కొన్నారు.
సినిమా పరిశ్రమ అభివృద్ధికి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలోని షేక్‌పేట్‌లో 2 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో పాటు మరికొందరు ఈ భూమిని తమ అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ హైకోర్టులో పిల్(PIL) దాఖలైంది. మెదక్‌కు చెందిన బాలకిషన్ 2012లో పిల్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు రాఘవేంద్రరావు తదితరులకు నోటీసులు జారీ చేసింది.
ఈ పిల్ విచారణలో రాఘవేంద్రరావుకు ఈ ఏడాది మార్చిలో కోర్టు నోటీసులు(notice) జారీ చేసింది. కానీ అవి ఆయనకు అందినట్లు రికార్డుల్లో లేకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను జనవరి 18కి వాయిదా వేశారు. బంజారాహిల్స్ సర్వే నంబర్ 403/1లోని 2 ఎకరాల భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించారనేది ప్రధాన ఆరోపణ. రాఘవేంద్రరావుతో పాటు ఆయన బంధువులు కృష్ణమోహన్‌రావు, చక్రవర్తి, విజయలక్ష్మి, అఖిలాండేశ్వరి, లాలసాదేవికి కోర్టు నోటీసులు జారీ చేసింది.