సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ థియేటర్లో దూసుకుపోతోంది హనుమాన్. కానీ ఈ సినిమా దర్శకుడు, నిర్మాత మధ్య గొడవ అనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Hanuman: తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ.. సంక్రాంతికి జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలై సుమారు 25 రోజులు అవుతున్నా కూడా ఇంకా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. మేకర్స్‌కు భారీగా లాభాలు తెచ్చి పెట్టిన హనుమాన్.. 25 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు హనుమాన్ ఈ రేంజ్ వసూళ్లు రాబడుతుందని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సంక్రాంతి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది హనుమాన్. 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయిన హనుమాన్.. పది రెట్లు ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టింది. గ్రాస్ పరంగా 300 కోట్లు రాబట్టిన హనుమాన్.. 160 కోట్ల షేర్ రాబట్టి 130 కోట్ల వరకు మేకర్స్‌కు లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ లాభాల్లో వాటా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి ముందుగా ఇచ్చిన పారితోషికం కాకుండా హీరోతో పాటు.. ప్రశాంత్ వర్మకు 6 కోట్లు ఇచ్చారట. కానీ సినిమాకు వచ్చిన వసూళ్లు నిర్మాత, దర్శకుడి మధ్య గొడవకు దారి తీసిందని అంటున్నారు. ప్రశాంత్ వర్మ తనకు లాభాల్లో వాటా కావాలని నిర్మాతతో గొడవ పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఏకంగా 30 కోట్లు షేర్‌గా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడట. హనుమాన్ సినిమాకు వచ్చిన హైప్‌కు సీక్వెల్‌గా అనౌన్స్ చేసిన జై హనుమాన్ పై భారీ అంచనాలున్నాయి. జై హనుమాన్ను అంతకుమించి తీస్తానని చెబుతున్నాడు ప్రశాంత్ వర్మ. దీంతో నిర్మాతను గట్టిగా డిమాండ్ చేస్తున్నాడట. కాదు కూడదు అంటే.. జై హనుమాన్ పై వాటా ఎఫెక్ట్ తప్పదంటున్నారు. మరి ఇద్దరి మధ్య రాజీ కుదురుతుందా? ప్రశాంత్ వర్మను నిరంజన్ రెడ్డి కూల్ చేస్తాడా? అనేది చూడాలి.