• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గడ్డి మందు తాగిన యువతి.. చికిత్స పొందుతూ మృతి

MHBD: తొర్రూరు మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన బోధసు మధుశాలికి వివాహం చేసుకోవడం ఇష్టం లేక ఈనెల 25న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ.. మృతి చెందింది. మృతురాలి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ పేర్కొన్నారు.

April 14, 2026 / 06:30 AM IST

‘హింస మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలో కలిసి పోవాలి’

ADB: నక్సలైట్‌లు హింస మార్గాన్ని విడిచిపెట్టి సమాజంలో కలిసి సాధారణ జీవితాన్ని గడపాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఉట్నూర్ మండల కేంద్రంలో గతంలో లొంగిపోయిన మాజీ నక్సలైట్ సభ్యులతో సమావేశమై మాట్లాడారు. లొంగిపోయిన వారికి గృహ స్థలాలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం, విద్యా సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

April 14, 2026 / 06:27 AM IST

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: మేయర్

BDK: కొత్తగూడెంలోని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని మేయర్ గణేష్ సూచించారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని కోరారు.

April 14, 2026 / 06:26 AM IST

14 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్ తప్పనిసరి: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో HPV వ్యాక్సినేషన్‌పై కలెక్టర్ సత్యప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. 2011-12లో జన్మించిన 14 ఏళ్ల బాలికలకు టీకా తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇది కీలకమన్నారు. పాఠశాలలు, అంగన్వాడీల ద్వారా గుర్తించి వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. జిల్లాలో 2170 డోసులు అందుబాటులో ఉండగా 769 మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపారు.

April 14, 2026 / 06:24 AM IST

‘Arrive-Alive’ కార్యక్రమాల పోస్టర్‌‌లు ఆవిష్కరణ

కామారెడ్డి జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ‘Arrive-Alive’ కార్యక్రమాలను నిన్నటి నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. దీనికి శ్రీకారం చుడుతూ కలెక్టర్, ఎస్పీ రాజేశ్ చంద్ర కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. పాదచారులు, వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచించారు.

April 14, 2026 / 06:23 AM IST

బుణ్యదిపురం పాఠశాలలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’

WNP: పెబ్బేరు మండలం బుణ్యదిపురం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సోమవారం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హర్యానా రాష్ట్రం వస్త్రధారణ, సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నాగ శేషు, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 06:20 AM IST

డీజీపీ స్వాగతం పలికిన కలెక్టర్

NRML: భరోసా కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన డీజీపీ శివధర్ రెడ్డికి కలెక్టర్ అభిలాష అభినవ్, SP జానకి షర్మిల పూల మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు. డీజీపీకి స్వాగతం పలికిన వారిలో అదనపు ఎస్పీలు రాజేశ్ మీనా, సాయి కిరణ్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పోలీస్ సేవలపై ఉన్నతాధికారులతో డీజీపీ చర్చించారు.

April 14, 2026 / 06:18 AM IST

అనుమతులు లేని ఆసుపత్రి సీజ్

WGL: నెక్కొండ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఉపేందర్ హాస్పిటల్‌ను జిల్లా వైద్యాధికారి బి. సాంబశివరావు ఆదేశాల మేరకు అధికారులు సోమవారం సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ సేవలు అందిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. గతంలో లింగ నిర్ధారణ కేసులో కూడా ఆసుపత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తెలిపారు.

April 14, 2026 / 06:16 AM IST

జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం

నిజామాబాద్ ఐడీవోసీ సమావేశ మందిరంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ అధ్యక్షతన సమావేశంలో హెచ్‌పీవీ టీకాలు, డెంగ్యూ, మలేరియా నియంత్రణపై సమీక్షించారు. పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు అమలు చేయాలని అధికారులకు సూచించారు.

April 14, 2026 / 06:13 AM IST

యువికా యంగ్ సైంటిస్ట్ 2026కు సిద్దిపేట అమ్మాయి

SDPT: మర్కూక్ మండలం దామరకుంట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పత్తి వర్షిత ప్రతిష్టాత్మక ‘యువికా యంగ్ సైంటిస్ట్ 2026’ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ ఘనత పాఠశాలకే కాకుండా జిల్లా మొత్తానికి గర్వకారణంగా నిలిచింది. తన ఫిజిక్స్ గైడ్ టీచర్ చిన్న బ్రహ్మయ్య పర్యవేక్షణలో వర్షిత ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

April 14, 2026 / 06:12 AM IST

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి

PDPL: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ళు చేపట్టాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి. మంథని ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మంథని ఏఎంసీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ప్రారంభిస్తారని అన్నారు.

April 14, 2026 / 06:12 AM IST

‘ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి’

ASF: మే 11 నుంచి ప్రారంభమయ్యే ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర జనాభా గణన అధికారి భారతి హోలికేరి అన్నారు. జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల జాబితా, ఎన్యుమరేటర్ల నియామకం, శిక్షణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆసిఫాబాద్‌లో 1,689 బ్లాక్లు, 994 ఎన్యుమరేటర్లు,174 సూపర్వైజర్లు విధుల్లో ఉంటారని కలెక్టర్ హరిత అన్నారు.

April 14, 2026 / 06:10 AM IST

‘రిజిస్టర్‌లో రైతులు పేర్లు నమోదు చేసుకోవాలి’

MNCL: యాసంగి వరి ధాన్యం విక్రయించే రైతులు కొనుగోలు కేంద్రాల్లోని సీరియల్ రిజిస్టర్లో పేర్లు నమోదు చేసుకోవాలని జన్నారం మండలం కవ్వాల్ క్లస్టర్ ఏఈవో అక్రమ్ సూచించారు. ధాన్యంలో తేమ 17% మించకుండా, తాలు లేకుండా జాగ్రత్త పడాలన్నారు. కాంటాకు ముందే పట్టాదార్ పాస్బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలను సెంటర్ ఇంఛార్జ్‌కు అందించి సహకరించాలని కోరారు.

April 14, 2026 / 06:09 AM IST

బొంరాస్పేటలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

VKB: బొంరాస్పేట మండలం నాగిరెడ్డిపల్లిలో కొత్తూరు వెళ్లే రోడ్డుపై సోమవారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ASI ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. వాహనదారులు తాగి వాహనం నడిపి ప్రమాదాలకు గురికావద్దని సూచించారు. పోలీసు సిబ్బంది శ్రీనివాసులు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 06:06 AM IST

సెన్సస్ ప్రక్రియకు పక్కా ప్రణాళిక: కలెక్టర్

BDK: జిల్లాలో సెన్సస్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు విస్తృత ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ అంకిత్ తెలిపారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీవో భారతి హోళీకేరికి వివరాలు వెల్లడించారు. సెన్సస్ ప్రతి దశను సమయపాలనతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వివిధ శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతం చేస్తున్నామని చెప్పారు.

April 14, 2026 / 06:05 AM IST