• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అంబేద్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

KNR: కేంద్రంలో నిర్వహించనున్న డాక్టర్ బీఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల పోస్టర్‌ను శంకరపట్నం మండల కేంద్రంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ రవి ఆవిష్కరించారు. ఈనెల 14న ఉదయం 9 గంటలకు కోర్టు చౌరస్తా వద్ద జయంతి ఉత్సవాలు జరగనున్నట్లు వారు తెలిపారు. వివిధ కుల సంఘాలు అంబేద్కర్ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

April 12, 2026 / 07:31 PM IST

ఇంటర్ ఫలితాల్లో వివేకానంద రెడ్డి సత్తా

NGKL: ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ ఫలితాల్లో సందడి వివేకానంద రెడ్డి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఒక ప్రైవేట్ కళాశాల విద్యార్థి అయిన ఈయన 470 మార్కులకు గాను 462 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకు నిలిచారు. తన విజయానికి క్రమశిక్షణ, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారమే కారణమని వివేకానంద రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఆయన్ను విద్యార్థులు, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు.

April 12, 2026 / 07:31 PM IST

సత్తా చాటిన గొర్రెల కాపరి కూతురు

SDPT: బెజ్జంకి మండలం గుండారం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి లచ్చయ్య కూతురు గొడ్డాటి కోమల ఇంటర్‌లో ప్రతిభ కనబరిచింది. వర్గల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న ఆమె, మొదటి సంవత్సరంలో 470 మార్కులకు 466 మార్కులు సాధించింది . సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కోమల ఈ ఫలితంతో గ్రామ ప్రజల ప్రశంసలు పొందింది.

April 12, 2026 / 07:30 PM IST

మండల టాపర్స్‌గా ఇద్దరూ అమ్మాయిలే…!

VKB: మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉర్దూ మీడియం సీఈసీ గ్రూప్‌లో సమీరా బేగం 948 మార్కులతో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర మండల టాపర్‌గా నిలిచింది. ఆమె ప్రతిభపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆదర్శ కళాశాలలో BiPC గ్రూప్‌లో సి.గాయత్రి 938 మార్కులతో మండల టాపర్‌గా నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు.

April 12, 2026 / 07:30 PM IST

మేడారం రైతులకు నష్టపరిహారం లేకపోవడంపై విమర్శలు

MLG: మేడారం రైతులకు రెండో పంట నష్టపరిహారం రాకపోవడానికి గత,ప్రస్తుత ప్రభుత్వాలే కారణమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దారావత్ దేవా నాయక్ ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ పాలనలోనూ రైతులకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కూడా రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

April 12, 2026 / 07:26 PM IST

పోలికలు సేమ్.. మార్కులు సేమ్..!

NLG: ఇంటర్మీడియట్ ఫలితాల్లో పట్టణానికి చెందిన కవలలు దుర్గాంజలి, అఖిల అద్భుత ప్రతిభ కనబరిచారు. స్థానిక కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వీరిద్దరూ ఒకే గ్రూపులో సమాన మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇవాళ విడుదలైన ఫలితాల్లో 1000 మార్కులకు ఇద్దరికీ 986 రావడం విశేషం. ఒకే కాలేజీలో చదువుతూ.. ఫలితాల్లోనూ సమాన స్కోరు సాధించినట్లు వారు తెలిపారు.

April 12, 2026 / 07:20 PM IST

దోరకుంటలో సీసీ కెమెరాల పరిశీలన ఎస్సై

SRPT: కోదాడ మండలం దోరకుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఎస్పీ నరసింహ సహకారంతో సర్పంచ్ పాలకి సురేశ్ ఆధ్వర్యంలో గ్రామస్థుల తోడ్పాటుతో వీటిని ఏర్పాటు చేశారు. త్వరలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీటిని అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఎస్సై తెలిపారు.

April 12, 2026 / 07:20 PM IST

సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన

WNP: శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మోజర్ల కళాశాలలో విద్యార్థులకు 7 రోజులపాటు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉద్యానవన ప్రొఫెసర్ బేబీ రాణి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రసాయనాలు తగ్గించి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని, రసాయనాలు వాడడం వల్ల వచ్చే నష్టాలను రైతులకు వివరించారు.

April 12, 2026 / 07:19 PM IST

బైక్‌ల ఢీ..ఇద్దరికి తీవ్ర గాయాలు

GDWL: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని గద్వాల రోడ్డు ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఆదివారం రెండు బైక్‌లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స కోసం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

April 12, 2026 / 07:15 PM IST

ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

WNP: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిఖిల్ నిలిచాడు. వీపనగండ్ల మండలానికి చెందిన నిఖిల్ ఎంపీసీలో 468/470 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించడం వీపనగండ్ల మండలానికి గర్వకారణమని స్థానిక సర్పంచ్ తెలిపారు. అనంతరం నిఖిల్‌ను అభినందించారు.

April 12, 2026 / 07:13 PM IST

ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం

WNP: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిఖిల్ నిలిచాడు. వీపనగండ్ల మండలానికి చెందిన నిఖిల్ ఎంపీసీలో 468/470 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచాడు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించడం వీపనగండ్ల మండలానికి గర్వకారణమని స్థానిక సర్పంచ్ తెలిపారు. అనంతరం నిఖిల్‌ను అభినందించారు.

April 12, 2026 / 07:13 PM IST

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్​ గ్రామానికి చెందిన కుర్మ రాకేష్ (15) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే, ఆదివారం సెలవు కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గొర్లు మేపడానికి వెళ్లారు. ఆ సమయంలో ఎండ తాకిడికి చెరువులో ఈతకు దిగారు. దింతో గుంతలో పడి మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు.

April 12, 2026 / 07:12 PM IST

‘అభివృద్ధికి సహకరిస్తాం’

JGL: కొడిమ్యాలలో అభివృద్ధి పనులకు సహకరిస్తానని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్నారు. మండల కేంద్రంలోని పోచమ్మ ఆలయం ప్రతిష్ఠాపానలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శివాలయానికి అవసరమైన గ్రానైట్ ఇస్తానని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఓ విద్యా సంస్థ అధినేత నరేందర్ రెడ్డి, పెద్దఎత్తున మహిళలు, పాల్గొన్నారు.

April 12, 2026 / 07:06 PM IST

‘సర్కారు పనితీరుకు ఇందిరమ్మ ఇళ్లు గీటురాయి’

KNR: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న ప్రజా ప్రభుత్వం పనితీరుకు ఇందిరమ్మ ఇళ్లు గీటురాయిగా నిలుస్తున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ మండలం మద్దికుంట, పచ్చునూరు గ్రామాల్లో ఆదివారం జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

April 12, 2026 / 07:05 PM IST

ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

NRPT: నారాయణపేట ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా మురళి భట్టాడ్, అధ్యక్షుడిగా కన్నప్ప కుమార్ శివ ఎంపికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్ బండారి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా చంద్రశేఖర్‌ బాధ్యతలు చేపట్టారు. అసోసియేషన్ సభ్యులందరూ కలిసి ఈ నూతన కమిటీని సమన్వయంతో ఎన్నుకున్నారు.

April 12, 2026 / 07:01 PM IST