»Traffic Restrictions In Hyderabad For Another Three Months
Traffic restrictions : హైదరాబాద్‌లో మరో మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ (Hyderabad) ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. మెట్రో స్టేషన్ వద్ద AG కాలనీ నుండి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా మూడు నెలల పాటు మెట్రో స్టేషన్(Metro station) వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు (POLICE) వెల్లడించారు. మార్చి 28వ తేదీ నుంచి జులై 28వ తేదీ వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి డైవర్ట్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ (Hyderabad) ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. మెట్రో స్టేషన్ వద్ద AG కాలనీ నుండి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా మూడు నెలల పాటు మెట్రో స్టేషన్(Metro station) వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు (POLICE) వెల్లడించారు. మార్చి 28వ తేదీ నుంచి జులై 28వ తేదీ వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని ట్రాఫిక్‌ను అవసరాన్ని బట్టి డైవర్ట్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. వాహనదారులు(Motorists) ట్రాఫిక్ ఆంక్షలను పాటించి సహకరించాలని ప్రయాణికులను కోరారు.
కూకట్పల్లి (Kukatpally) నుంచి అమీర్‌పేట్ వైపు వెళ్లే వాహనాలు కూకట్పల్లి మెట్రో స్టేషన్ యూటర్న్ వద్ద లెఫ్ట్ టర్న్ ఐడిఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్ బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పార్వత్ నగర్, టోడీ కాంపౌండ్ వైపు మళ్లించనున్నారు. ఇక కూకట్పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కూకట్పల్లి వై జంక్షన్, బాలానగర్ ఫ్లైఓవర్(Balanagar Flyover), న్యూ బోయినపల్లి జంక్షన్, ప్యారడైస్ జంక్షన్, బేగంపేట ఫ్లైఓవర్ వద్ద మళ్లించనున్నారు.ఇక బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట్ వైపు వెళ్లే వాహనాలను బాలానగర్ ఫ్లై ఓవర్ కింద న్యూ బోయినపల్లి జంక్షన్, తాడ్‌బండ్ రైట్ టర్న్, ప్యారడైస్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ వైపు మళ్లించనున్నారు. అలాగే మూసాపేట్, గూడ్షెడ్ రోడ్డు నుంచి అమీర్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఐడిఎల్ లేక్ రోడ్, గ్రీన్‌హిల్స్ రోడ్, రెయిన్ బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లై ఓవర్, పార్వత్ నగర్, టోడీ కాంపౌండ్, కావూరి హిల్స్ వైపు మళ్లిస్తారు. నాలా పునర్నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని హైదరాబాద్ (Hyderabad) ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు, ప్రయాణికులకు కోరారు.