»Posters On Modi In Hyderabad On Delayed Flyover Construction
Hyderabadలో పోస్టర్లు కలకలం.. మోదీ గారు ఇంకెన్నాళ్లు కడతారు?
నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో పనుల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం దుమ్ముధూళిలో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టర్లు వెలుగులోకి రావడం చర్చానీయాంశంగా మారింది.
తెలంగాణ (Telangana)లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులు, అభివృద్ధిని వివరిస్తూనే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi- BRS Party) ప్రశ్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతున్నాడని తీరొక్క రీతిలో ఎలుగెత్తి చాటుతోంది. తాజాగా రోడ్ల అభివృద్ధిపై బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తోంది. ఈ సందర్భంగా ఉప్పల్- నారపల్లి ప్రధాన రహదారిలో ప్రధానిని ప్రశ్నిస్తూ వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా ఈ పోస్టర్ల వార్త చర్చనీయాంశమైంది.
‘మోదీ గారు ఈ ఫ్లై ఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు? పని ప్రారంభం 5 మే 2018. 5 ఏండ్లు అయినా ఉప్పల్- నారపల్లి ఫ్లై ఓవర్ 40 శాతం కూడా పూర్తి కాలేదు’ అంటూ నిలదీస్తూ మోదీ ఫొటో ఉన్న పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. నగర శివారులో ఉప్పల్ నుండి ఘట్ కేసర్ మార్గంలో ఈ పోస్టులు గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. ఈ పనుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎన్నాళ్లు ఈ పనులు జరుగుతాయని ప్రజలు నిలదీస్తున్నారు. కాగా ఈ పనుల విషయమై ఓ నెటిజన్ ట్వీటర్ లో ప్రశ్నించగా.. మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘మేం భూములు అప్పగించాం.. పనులు చేయాల్సింది కేంద్రమే. మేం హైదరాబాద్ లో మిగతా ఫ్లై ఓవర్లు చకాచకా పూర్తి చేస్తుంటే కేంద్రం ఈ ఫ్లై ఓవర్లను ఎందుకు పూర్తి చేయడం లేదో మీకే తెలియాలి’ అని బదులిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టర్లు వెలుగులోకి వచ్చాయి.
Lakhs of commuters facing inconvenience between Uppal-Narapally over the years due to the snail pace work of the Central Govt
While the TS govt completed more than 35 SRDP projects at a rapid pace, people nailing the incompetence of #Modi govt on the pillars of the ongoing… pic.twitter.com/myreiMpp7Z
వాస్తవం ఇది
వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్ నుండి ఘట్ కేసర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ (Uppal- Narapally Flyover) పనులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఉప్పల్ రింగ్ రోడ్డు (Uppal Ring Road), బోడుప్పల్ (Boduppal), మేడిపల్లి (Medipally), చెంగిచెర్ల (Chengicherla) చౌరస్తాల మీదుగా ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు ప్రారంభమై ఐదు సంవత్సరాలు గడిచాయి. కానీ ఇంకా పూర్తి కాలేదు. కేవలం స్తంభాల (Pillars) వరకు పనులు పూర్తయ్యాయి. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో పనుల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం దుమ్ముధూళిలో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టర్లు వెలుగులోకి రావడం చర్చానీయాంశంగా మారింది. కాగా ఈ పోస్టర్లను బీఆర్ఎస్ పార్టీ అతికించి ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలోనూ కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్ అంతటా మోదీ వ్యతిరేక పోస్టర్లు (Posters), బ్యానర్లు (Banners) వెలిసిన విషయం తెలిసిందే. తాజా పోస్టర్ల వెనుక కూడా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఉందని సమాచారం.