»Brs Mps Move Adjournment Motion On Women Reservation Bill
BRS Party మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులకు కవిత పోస్టు కార్డులు రాశారు. త్వరలోనే కవిత దేశవ్యాప్త చర్చ చేపట్టనున్నారు. ఈ మేరకు కార్యాచరణ, ప్రణాళిక సిద్ధమవుతున్నది.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు (Women Reservation Bill) కల్పించాలనే డిమాండ్ పై భారత రాష్ట్ర సమితి పార్టీ (Bharat Rashtra Samithi- BRS Party) ఉద్యమాన్ని (Movement) ఉధృతం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) దేశవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతుండగా.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) పార్లమెంట్ వేదికగా పోరాటం ప్రారంభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోరుతూ గులాబీ పార్టీ ఎంపీలు లోక్ సభ (Lok Sabha)లో వాయిదా తీర్మానం (Adjournment Motion) ఇచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించాలని కోరుతూ ఆ పార్టీ ఎంపీలు నామ నాగేశ్వరరావు (Nama Nageswara Rao), మాలోతు కవిత (Maloth Kavitha) వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించే అవకాశం లేదు. తోసి పుచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చించాలని ఎంపీ మాలోతు కవిత డిమాండ్ చేశారు. ఈ విషయమై కవిత ఉద్యమాన్ని తీవ్రరూపం చేస్తున్నారు. త్వరలో దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా కార్యక్రమాలు నిర్వహించాలని కవిత ప్రణాళిక రూపొందిస్తున్నారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులకు కవిత పోస్టు కార్డులు రాశారు. త్వరలోనే కవిత దేశవ్యాప్త చర్చ చేపట్టనున్నారు. ఈ మేరకు కార్యాచరణ, ప్రణాళిక సిద్ధమవుతున్నది.