»Ktr Said Fully Welcome The Womens Reservation Bill
KTR: మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నా, నా సీటు పోయినా సరే
మాదాపూర్లో ఇంటర్నేషనల్ టెక్పార్క్ను ప్రారంభించిన తరువాత కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీసుకొస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుపై కామెంట్ చేశారు. ఆ బిల్లు కోసం తన సీటు పోయినా సరేనన్నారు.
KTR: మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill)ను తాను సంపూర్ణంగా స్వాగతిస్తున్నానని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(KTR) పేర్కొన్నారు. మాదాపూర్లో ఇంటర్నేషనల్ టెక్పార్క్ను ప్రారంభించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో(Politics)కి మహిళా నేతలు చాలా మంది రావాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లో భాగంగా నా సీటు పోతే పోనివ్వండి. మన జీవితాలు చాలా చిన్నవి, నా పాత్ర నేను పోషించాను అని కేటీఆర్ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రమంత్రి మండలి సెప్టెంబర్ 18న ఆమోదం తెలిపింది. ఆ తర్వాత రోజు బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. ప్రస్తుతం బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు అయితే అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లు పట్ల సుముఖంగానే ఉన్నారు. త్వరలో ఈ బిల్లు అమల్లోకి వస్తుందని ప్రజలంతా భావిస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారింది.