సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సాయికుల్వంత్ మందిరంలో ఇవాళ సాయంత్రం 6 గంటలకు అఖండ భజన ప్రారంభంకానుంది. సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకుని ఏటా దీనిని నిర్వహించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం 6 గంటలకు మహామంగళహారతితో భజన ముగుస్తుంది. దేశ, విదేశాల్లోని భక్తులు అఖండ భజనలో పాల్గొననున్నారు.