MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో 42% బీసీ రిజర్వేషన్ అమలు అంశంపై శుక్రవారం మేధోమథన సదస్సు నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ సాధనపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య వంటి మేధావులను ఆహ్వానించి త్వరలో సదస్సు నిర్వహిస్తామని ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డా. నాగం కుమారస్వామి తెలిపారు.