Target Fix వంద సీట్లు లక్ష్యం.. కేసీఆర్ పేరిట రికార్డు సాధిద్దాం: KTR
అందరి అభిప్రాయాలు తీసుకుని మేనిఫెస్టో (Manifesto) రూపొందిస్తాం. దీని ప్రకారం ముందుకు సాగితే వంద సీట్లు ఎలా రావో చూద్దాం’ అని కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడారు.
ఎన్నికలకు సమయం దూసుకొస్తోంది.. అధికారం కోసం ప్రతిపక్షాలు అర్రులు చాస్తున్నాయి. ప్రభుత్వాన్ని బద్నాం చేసి ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని దొరికిన ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీజేపీలు మరింత దిగజారుతున్నాయి. వాటికి దీటుగా అధికార బీఆర్ఎస్ పార్టీ (Bharat Rashtra Samithi- BRS Party) వెళ్తోంది. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొడుతూనే వాస్తవాలు వివరిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పేసింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KT Rama Rao) తమ లక్ష్యం వంద సీట్లు అని ప్రకటించారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో వంద సీట్లు (MLA Seats) సాధించి మూడోసారి అధికారంలోకి (Power) వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla District)లో కేటీఆర్ (KTR) సోమవారం విస్తృతంగా పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే కావడంతో తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బీఆర్ఎస్ (BRS Party) ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ఆసక్తికర విషయాలు తెలిపారు. టీఎస్ పీఎస్సీ (TSPSC)లో ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రతిపక్షాల ఆరోపణలకు బదులు ఇచ్చారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతూనే ప్రభుత్వ గొప్పలు వివరించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో వివరిస్తూనే కేంద్రం ఎలా మోసం చేస్తుందో ఆధారాలతో సహా వివరించారు.
‘రాష్ట్రంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో ఎప్పుడైనా ఎన్నికలు (Assembly Election) జరగవచ్చు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వంద సీట్లు సాధించి హ్యాట్రిక్ (Hattrick) సాధిద్దాం. ఇప్పటివరకు దక్షిణ భారతదేశంలో (South India) హ్యాట్రిక్ సాధించిన ముఖ్యమంత్రి లేరని, ఆ ఘనత కేసీఆర్ (KCR)కు దక్కేలా ప్రతి కార్యకర్త సైనికుడిలా (Soldier) పని చేయాలి’ అని బీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ సూచించారు. ‘మన సంక్షేమ పథకాలను పొందుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా నియత్ ఉంటే మనకే ఓటేయాలి’ అని పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారు. వారితో క్షేత్రస్థాయిలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలి. ఏప్రిల్ 20లోగా మున్సిపాలిటీ, గ్రామాల్లో సమ్మేళనాలు పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధం కావాలి. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. అందరి అభిప్రాయాలు తీసుకుని మేనిఫెస్టో (Manifesto) రూపొందిస్తాం. దీని ప్రకారం ముందుకు సాగితే వంద సీట్లు ఎలా రావో చూద్దాం’ అని కేటీఆర్ కార్యకర్తలతో మాట్లాడారు.