»Old Man Came To The Polling Station With An Oxygen Cylinder
Oxygen Cylinderతో పోలింగ్ కేంద్రానికి వృద్దుడు.. ఓటేసి, ఆదర్శంగా నిలిచి
ఓ రోగి ఆక్సిజన్ సిలిండర్ వెంటేసుకొని మరి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తనకు ఓటు విలువ తెలుసు అని, అందుకే 1966 నుంచి కంటిన్యూగా ఓటు వేస్తున్నానని తెలిపారు.
Old man came to the polling station with an oxygen cylinder
Old Man Cast Vote: ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల పాలిట బ్రహ్మాస్ర్తం. తమ భవిష్యత్‌ను నిర్ణయించే నేతను ఎన్నుకునే సందర్భం. ఆచి తూచి మరి ఎన్నుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. సిటీలో మందకొడిగా పోలింగ్ జరుగుతోంది. కానీ గచ్చిబౌలిలో ఓ వృద్దుడు (Old Man) మాత్రం అలా చేయలేదు.
గచ్చిబౌలికి చెందిన శేషయ్య (seshaiah) వయస్సు 75 ఏళ్లు. ఇతనికి లివర్ సిరోసిస్ సమస్య ఉంది. ఆక్సిజన్ (oxygen) లేకుంటే ఊపిరి ఆగే పరిస్థితి.. అయినప్పటికీ ఓటు విలువ అతనికి తెలుసు.. అందుకే తనతో ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని వచ్చాడు. గచ్చిబౌలిలో గల జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో ఓటు వేశాడు. ఓటు వేయడం పౌరుడిగా తన బాధ్యత అంటున్నారు. 1966 నుంచి మిస్ కాకుండా ఓటు వేస్తున్నానని తెలిపారు.
ముషీరాబాద్ గాంధీనగర్ ఎస్బీఐ కాలనీకి చెందిన ఆస్తమా రోగి లక్ష్మీ శ్యాంసుందర్ అనే వృద్దురాలు ఓటు వేశారు. విద్యానగర్‌లో గల హిందీ మహా విద్యాలయలో ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఓటేశారు. 99 ఏళ్ల వయస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి మరీ ఓటు వేశారు. శేషయ్య, చుక్కా రామయ్య, లక్ష్మీ శ్యాం సుందర్ మిగతా వారికి ఆదర్శంగా నిలిచారు. హాలీ డే ఇచ్చారు కదా అని ఇంట్లో రెస్ట్ తీసుకోవడమో.. లేదంటే షికార్ల కోసం బయటకు వెళ్లడమో చేస్తున్నారు. అలాంటి వారు.. వీరిని చూసి ఓటేయాలని ఎన్నికల అధికారులు చెబుతున్నారు.