»Bellamkonda Sai Sreenivas Chatrapathi Movie Releasing On May 12th
Prabhasను మించి కండలు పెంచిన బెల్లంకొండ హీరో.. ఈసారైనా సక్సెస్ దక్కేనా
18 ఏళ్ల కిందట ఎస్ఎస్ రాజమౌలి (SS Rajamouli), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులకు అలరిస్తుందో లేదో చూడాలి. బాలీవుడ్ (Bollywood)లో విజయవంతమైతే సాయి శ్రీనివాస్ మరో సినిమా అక్కడే చేసే అవకాశం ఉంది.
సినీ పరిశ్రమ (Cine Industry)లో తండ్రి అగ్ర నిర్మాత (Producer)గా వెలుగొందుతున్న సమయంలోనే అతడి వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. హీరోగా అరంగేట్రం చేసిన అతడికి అదృష్టం కలిసి రావడం లేదు. దాదాపు పది సినిమాలు చేసినా విజయం అనేది దూరంగానే ఉంటున్నది. మోస్తరుగా అతడి సినిమాలు ఆడుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోకి ప్రవేశించి అదృష్టం పరీక్షించుకోనున్నాడు. అతడే బెల్లంకొండ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas). తెలుగులో ప్రభాస్ కెరీర్ లో భారీ హిట్ కొట్టిన ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.
బెల్లంకొండ సురేశ్ (Bellamkonda Suresh) తనయుడు ‘అల్లుడు శ్రీను (Alludu Sreenu)’ పేరిట సాయి శ్రీనివాస్ ను పరిశ్రమకు పరిచయం చేసిన వీవీ వినాయక్ (VV Vinayak) హిందీలో ఛత్రపతి (Chatrapathi Movie) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ (Shooting) పూర్తయి విడుదలకు (Release) సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఫస్ట్ లుక్ (First Look)ను విడుదల చేశారు. ఛత్రపతి, కాట్రాజ్ కి మధ్య సముద్రం ఒడ్డున జరిగే ఫైటింగ్ సీన్ లో సాయి శ్రీనివాస్ కనిపించాడు. సిక్స్ ప్యాక్ తో ఉన్న శ్రీనివాస్ బ్యాక్ సైడ్ ఫొటోను చిత్రబృందం పంచుకుంది. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ (Pen Studios) బ్యానర్ పై జయంతి లాల్ నిర్మిస్తున్నాడు.
కాగా రెండేళ్ల కిందట పట్టాలు ఎక్కిన ఈ సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతాయి. థియేటర్ లలో విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు వచ్చాయి. ఒక దశలో ఓటీటీలో విడుదలవుతుందనే వార్తలు వినిపించాయి. కానీ తాజా ప్రకటనతో ఈ సినిమా నేరుగా థియేటర్ లలోనే విడుదల కానుంది. మే 12వ తేదీన విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. 18 ఏళ్ల కిందట ఎస్ఎస్ రాజమౌలి (SS Rajamouli), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులకు అలరిస్తుందో లేదో చూడాలి. బాలీవుడ్ (Bollywood)లో విజయవంతమైతే సాయి శ్రీనివాస్ మరో సినిమా అక్కడే చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా రీమేక్ (Remake)లో నటిస్తున్నాడు. ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.