»Parliament Adjourned To Opposition Parties Stir On Rahul Gandhi Disqualification
Rahul Gandhi ప్రారంభమైన నిమిషానికే వాయిదా.. నల్లదుస్తుల్లో విపక్షం ఆందోళన
రాహుల్ పై అనర్హత వేటు (Disqualification)పై సోమవారం కాంగ్రెస్ పార్టీ సభ్యులు నలుపు దుస్తులు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. రాహుల్ సభ్యత్వ రద్దుపై నిరసన వ్యక్తం చేశారు.
రెండేళ్ల జైలు శిక్ష పడడంతో రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. రాహుల్ సభ్యత్వం రద్దుపై సోమవారం పార్లమెంట్ (Parliament)ను స్తంభించింది. ఉభయసభల్లో ఈ అంశంపై ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ సభ్యత్వ రద్దుపై నల్ల దుస్తులు ధరించి నిరసన చేపట్టారు. అయితే లోక్ సభ (Lok Sabha), రాజ్య సభ (Rajya Sabha) ప్రారంభమైన నిమిషానికే వాయిదా పడ్డాయి. కాగా ఈ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ (New Delhi)లో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ (INC) నేతృత్వంలో జరిగిన విపక్ష సభ్యుల సమావేశానికి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (Bharat Rashtra Samithi- BRS Party), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ-TMC) కూడా హాజరవడం విశేషం.
రాహుల్ పై అనర్హత వేటు (Disqualification)పై సోమవారం కాంగ్రెస్ పార్టీ సభ్యులు నలుపు దుస్తులు ధరించి సమావేశాలకు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. రాహుల్ సభ్యత్వ రద్దుపై నిరసన వ్యక్తం చేశారు. ఉభయసభల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటలకు చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ (Dhankhad) వాయిదా వేయగా.. లోక్ సభను సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓం బిర్లా (Om Birla) వాయిదా వేశారు.
సభలు వాయిదా అనంతరం కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) కార్యాలయంలో జరిగిన సమావేశానికి డీఎంకే (DMK), సమాజ్ వాదీ పార్టీ (SP), జేడీయూ (JDU), ఆర్జేడీ (RJD), సీపీఐ(ఎం), సీపీఐ (CPI), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), నేషనల్ కాన్ఫరెన్స్ (NC), శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం) తదితర పార్టీల సభ్యులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు హాజరు కావడం విశేషం. సమావేశంలో రాహుల్ అనర్హతపై ఉమ్మడి వ్యూహంపై చర్చించారు. పార్లమెంట్ లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమాలోచనలు చేశారు.