»Father Killed Her 19 Year Old Daughter In Uttar Pradesh
Love Affair కుమార్తెను చంపేసి కరెంట్ షాక్ పేరిట తండ్రి నాటకం
తీవ్రంగా కొట్టడంతో చాందినీ మృతి చెందింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్న కుమార్తెకు చెప్పి చాందినీ విద్యుద్ఘాతానికి గురై చనిపోయిందని నమ్మించాడు. అనంతరం కుమార్తె అంత్యక్రియలు సక్రమంగా పూర్తి చేశాడు. అయితే తన అక్క చనిపోవడాన్ని సోదరి ఆసియా జీర్ణించుకోలేకపోయింది.
కొత్త కొత్త నేరాలతో ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో నేరాల సంఖ్య (Crime Rate) పెరుగుతోంది. దేశంలోనే అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రం యూపీనే. ఆ రాష్ట్రంలో రోజుకు పదుల సంఖ్యలో నేరాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ పరువు హత్య కలకలం రేపింది. కుమార్తె ఒకరిని ప్రేమించిందని (Love) తెలిసి కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించాడు. కూతురును ఇంట్లో బంధించి చితకబాదాడు. తీవ్రంగా దాడి చేయడంతో ఆ యువతి చనిపోయింది. అయితే తన బిడ్డ విద్యుదాఘాతానికి (Current Shock) గురయి చనిపోయినట్టు నాటకం ఆడాడు. చివరికి చిన్న కూతురు ద్వారా ఈ విషయం బయటకు తెలిసింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
యూపీలోని ప్రయాగ్ రాజ్ (Prayagraj District) జిల్లా కర్చన పోలీస్ స్టేషన్ (Karchhana) పరిధిలో హిందూబేలా గ్రామానికి చెందిన లల్లన్ కు ఇద్దరు కుమార్తెలు చాందినీ (19) (Chandini), ఆసియా (15). కొంతకాలంగా పెద్ద కుమార్తె చాందినీ ఓ అబ్బాయిని (Young Boy) ప్రేమిస్తుండేది. రెండు నెలల కిందట ప్రియుడితో కలిసి చాందినీ వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు వెతికి మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. అయితే 20 రోజుల కిందట చాందినీ మరోసారి పారిపోయింది. ఈసారి తన చెల్లెలు ఆసియా (Asia)ను కూడా వెంట తీస్కెళ్లింది. తన ఇద్దరు కుమార్తెలు వెళ్లిపోవడంతో తండ్రి లల్లన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా వారిద్దరూ ముంబైలో ఉన్నారని గుర్తించారు. వారిని స్వగ్రామం తీసుకొచ్చారు.
ఈ సమయంలో తాను ఒకరిని ప్రేమించానని.. అతడితోనే ఉంటానని కుమార్తె చాందినీ చెప్పడంతో తండ్రి లల్లన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ యువతిని ఇంట్లో బంధించి చితకబాదాడు. ఈ నెల 24న శుక్రవారం తీవ్రంగా కొట్టడంతో చాందినీ మృతి చెందింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చిన్న కుమార్తెకు చెప్పి చాందినీ విద్యుద్ఘాతానికి గురై చనిపోయిందని నమ్మించాడు. అనంతరం కుమార్తె అంత్యక్రియలు సక్రమంగా పూర్తి చేశాడు. అయితే తన అక్క చనిపోవడాన్ని సోదరి ఆసియా జీర్ణించుకోలేకపోయింది.
చాందినీ చనిపోవడానికి నాన్నే కారణమంటూ ఆసియా గ్రామస్తులకు చెప్పింది. జరిగిన తతంగమంతా చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందించడంతో పోలీసులు లల్లన్ ను అరెస్ట్ చేశారు. చాందినీ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు యమునానగర్ డీసీపీ సంతోశ్ కుమార్ మీనా తెలిపారు. ప్రేమ వ్యవహారమే అతడు తన కూతురిని హత్య చేసినట్లు వివరించారు.