»Malayalam Actor Former Mp Innocent Passed Away At 75
Innocent దిగ్గజ నటుడు కన్నుమూత.. సీఎం, హీరోలు దిగ్భ్రాంతి
హాస్య నటుడిగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అతడి మృతితో మలయాళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. ఈ సందర్భంగా సినీ నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇన్నోసెంట్ తో ఉన్న తమ అనుబంధాన్ని తలచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.
దశాబ్దాల పాటు సినీప్రియుల (Movie Lovers)ను తన నటనతో ఆకట్టుకున్న మలయాళ (Mollywood) దిగ్గజ నటుడు ఇన్నోసెంట్ (75) (Innocent) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూనే గుండెపోటు (Heart Attack)కు గురై తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో మలయాళ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగింది. అతడి మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan), మలయాళ నటులు మోహన్ లాల్ (Mohanlal), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)తోపాటు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor), , బీజేపీ ఎంపీ ఖుష్బూ సంతాపం వ్యక్తం చేశారు.
1972లో నృతశాల సినిమాతో ఇన్నోసెంట్ సినీ పరిశ్రమ (Cine Industry)లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారు. అక్కరే నిన్నోరు మారన్, గాంధీనగర్ సెండక్ స్ట్రీట్, నాడోడిక్కట్టు, రామోజీ రావు స్పీకింగ్, తూవల్ స్పర్శమ్, డాక్టర్ పశుపతి, సందేశం, కేళి. దేవసూరం, కడువా తదితర చిత్రాలు ఇన్నోసెంట్ కు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. చివరిగా నటించిన సినిమా ‘అత్బుథవిలక్కుమ్). ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు 15 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా ఇన్నోసెంట్ కొనసాగారు. గతంలో ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు. క్షేమంగా కోలుకున్నారు. తన క్యాన్సర్ జీవితంపై ‘క్యాన్సర్ వార్డులో నవ్వులు’ (Laughter in the Cancer Ward) అనే పుస్తకం రాశారు. హాస్య నటుడిగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అతడి మృతితో మలయాళ సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. ఈ సందర్భంగా సినీ నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇన్నోసెంట్ తో ఉన్న తమ అనుబంధాన్ని తలచుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.
స్వతంత్ర ఎంపీగా విజయం
ఆయన సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రాణించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో చాలాకుడి లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగగా ఎల్డీఎఫ్ మద్దతు ఇవ్వడంతో ఎంపీగా ఇన్నోసెంట్ విజయం సాధించారు.
Mourning the loss of character actor, comedian & one-time Kerala MP Innocent, who has just passed away at age 75. Aside from being a brilliantly inventive & gifted actor, he was a fine human being whom it was a pleasure to interact with in the Lok Sabha. RIP. Om Shanti. pic.twitter.com/m9mFGI8DwM