»Kerala Governor Arif Mohammed Khan Sensational Comments On Cm Vijayan
Kerala Governor: సీఎం విజయన్‌పై కేరళ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
కేరళ సీఎం పినరయి విజయన్, అక్కడి గవర్నర్ మధ్య మాటల యుద్ధం కాస్తా గొడవకు దారితీసినట్లు తెలుస్తోంది. తాజాగా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తనపై సీఎం దాడి చేయించారని ఆరోపణలు చేశారు. దీంతో ఈ వివాదం కాస్తా చర్చనీయాంశంగా మారింది.
Kerala Governors sensational comments on CM Vijayan
కేరళ సీఎం పినరయి విజయన్ పై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్(Arif Mohammed Khan)సంచలన ఆరోపణలు చేశారు. తనపై భౌతిక దాడి చేసి గాయపరిచేందుకు సీఎం కుట్ర పన్నారన్నారు. ఢిల్లీ వెళ్లే క్రమంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తల వాహనాలు గవర్నర్ వాహనాన్ని ఢీకొట్టాయి. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న గవర్నర్ ఆగ్రహంతో కారు దిగి ఘటన వెనుక సీఎం విజయన్ కుట్ర ఉందని ఆరోపించారు. సీఎం కాన్వాయ్ వెళ్తుంటే మధ్యలో వేరే కార్లు రావడానికి అనుమతిస్తారా? సీఎం కారు దగ్గరకు మరో కారు తీసుకువస్తారా? అయితే నా విషయంలో ఏం జరిగింది..? నా కాన్వాయ్‌కు వెళ్లే దారిలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కార్లలో వచ్చి నల్లజెండాలు ప్రదర్శించారు. రెండు వైపుల నుంచి వారి కార్లు నా కారును ఢీకొన్నాయని గవర్నర్ అన్నారు.
ఇదంతా జరుగుతుండగా పోలీసులు వారిని కార్లలోకి తోసేశారు. దీంతో ఎస్ఎఫ్ఐ(SFI) కార్యకర్తలు అక్కడి నుంచి పారిపోయారు. ఇది కచ్చితంగా సీఎం విజయే చేశారని గవర్నర్ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గూండాలను పంపి నాపై దాడికి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. అంతేకాదు తిరువనంతపురం రోడ్లు గుండాల ఆధీనంలోకి వచ్చాయని అన్నారు. సీఎం నాతో విభేదించాలనుకుంటే విభేదించవచ్చు. నాపై దాడి చేయాల్సిన అవసరం లేదన్నారు. కేరళలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయని గవర్నర్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ(kerala)లో సీఎం పినరయి విజయన్(pinarayi vijayan), గవర్నర్ ఆరిఫ్ ఖాన్ మధ్య మాటల యుద్ధం కాస్తా ఇలా దారితీసిందని పలువురు అంటున్నారు.