»Shikhar Dhawan Revealed Hiv Test Story When He Was 15 Years Old
HIV Test నాన్న వల్ల హెచ్ఐవీ పరీక్ష చేసుకున్నా: శిఖర్ ధావన్
ధవన్ కు ఇదే చివరి ఐపీఎల్ కానుందని తెలుస్తున్నది. అతడు త్వరలో ఆటకు వీడ్కోలు (Retirement) పలికే అవకాశం ఉంది. 37 ఏళ్లు వయసు ఉండడం.. నిలకడ లేమి ఆటతీరుతో నిరాశ పరుస్తున్నాడు. ఏది ఏమైనా ఈ సీజన్ లో సత్తా చాటితేనే అతడి భవిష్యత్ ఆధారపడి ఉంది.
భారత సీనియర్ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ఐపీఎల్ (Indian Premier League-IPL 2023)కు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే ప్రారంభం కానున్న ఐపీఎల్ లో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే నిర్వహించిన ఇంటర్వ్యూ (Interview)లో ధవన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా హెచ్ఐవీ (HIV Test) పరీక్ష గురించి వివరించాడు. తన తండ్రి ఒత్తిడి వలన ఆ పరీక్ష చేసుకున్నట్లు తెలిపాడు. దీంతోపాటు మిగతా వ్యక్తిగత అంశాలు (Personal Issues) నెమరువేసుకున్నాడు.
‘నేను 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కుటుంబం (Family)తో కలిసి మనాలీ (Manali Tour) సందర్శనకు వెళ్లాం. అక్కడ మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా నేను భుజంపై టాటూ (Tatoo) వేయించుకున్నా. అది కనిపించకుండా జాగ్రత్త పడ్డా. 3 నుంచి 4 నెలల వరకు టాటూ దాచి ఉంచా. అయితే ఒక రోజు మా నాన్నకు టాటూ విషయం తెలిసిపోయింది. టాటూను చూసి నన్ను తీవ్రంగా కొట్టాడు. టాటూ వేయించుకున్న తర్వాత నేను కూడా భయపడ్డా. టాటూ వేసే వ్యక్తి ఏ సూదీ (Needle)తో వేసి ఉంటాడోనని మా నాన్న (Father)తో వెళ్లి హెచ్ఐవీ వైరస్ పరీక్ష చేయించుకున్నా. అదృష్టవశాత్తు నెగిటివ్ (Negative) తేలింది’ అని ధావన్ తెలిపాడు.
కాగా తాజా ఐపీఎల్ లో ధవన్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings)కు సారథ్యం వహిస్తున్నాడు. మొహలీలో ప్రస్తుతం ప్రాక్టీస్ (Practice) చేస్తున్నాడు. ఏప్రిల్ 1వ తేదీన తొలి మ్యాచ్ తో కోలక్ నైట్ రైడర్స్ తో గబ్బర్ సేన తలపడనుంది. ఐపీఎల్ ట్రోఫీ పంజాబ్ జట్టు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కాగా ధవన్ కు ఇదే చివరి ఐపీఎల్ కానుందని తెలుస్తున్నది. అతడు త్వరలో ఆటకు వీడ్కోలు (Retirement) పలికే అవకాశం ఉంది. 37 ఏళ్లు వయసు ఉండడం.. నిలకడ లేమి ఆటతీరుతో నిరాశ పరుస్తున్నాడు. ఏది ఏమైనా ఈ సీజన్ లో సత్తా చాటితేనే అతడి భవిష్యత్ ఆధారపడి ఉంది.