»Akshay Kumar And Shikhar Dhawan Pray For India To Win At Mahakaleshwar Temple
Shikhar Dhawan: జట్టులో స్థానం దక్కక పోయినా కప్ గెలవాలని పూజలు
ఇండియా ప్రపంచకప్‌లో స్థానం దక్కక పోయినా ఆసియా కప్, వరల్డ్ కప్‌లో భారత్ గెలువాలని స్టార్ క్రికేటర్ శిఖర్ ధావన్ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ స్టార్ హీరో ఉండడం విశేషం.
Shikhar Dhawan: టీమిండియా స్టార్ ఓపెనర్, సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan) పూజలు చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కని విషయం తెలిసిందే. అయితే ఆసియా కప్(Asiacup2023) లో ధావన్‌కు స్థానం దక్కలేదు. అయినా సరే వరల్డ్ కప్ లో తనను తీసుకుంటారని అంతా భావించినా.. ఐసీసీ టోర్నీల్లో అద్భుత రికార్డ్‌లు ఉన్నప్పటికీ ఫామ్ లేని కారణంగా వరల్డ్ కప్ జట్టులో సెలక్ట్ చేయలేదు. అయితే ప్రస్తుతం ధావన్ చేసిన పనికి క్రికెట్ అభిమానుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాములుగా అర్హత కలిగిన ప్లేయర్‌ని జట్టులోకి తీసుకోపోతే సెలక్టర్ల మీద అసంతృప్తి వ్యక్తం చేసి, సంచలన కామెంట్స్ చేస్తుంటారు. కానీ శిఖర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. తనని జట్టులో ఎంపిక చేయకపోయినా జట్టు గెలవాలని పూజలు చేస్తున్నాడు. ఉజ్జయినిలోని బాబా మహాకాళేశ్వర్(Mahakaleshwar)లోని ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిర్లింగ దేవాలయంలో శిఖర్ ధావన్ ప్రార్థనలు చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఉండడం మరో విశేషం. కొన్ని రోజుల క్రితం గబ్బర్..టీమిండియా గెలవాలని విష్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టెంపుల్ లో కనిపించి తాను ఎంత స్పోర్టీవ్ గా ఉంటాడో మరోసారి తెలియజేశాడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆసియా కప్ భారత్ గెలువాలని దేశమంతా కోరుకుంటున్నారు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిమాన బ్యాటింగ్ భాగస్వామి గురించి ఇటీవల మాట్లాడాడు. తనకు ఇష్టమైన బ్యాటింగ్ భాగస్వామి ఎవరో చెప్పాడు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి లేదా శుభ్‌మన్ గిల్ పేరు చెప్పకపోవడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేసింది.