యావత్తు ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న జీ20 సదస్సు నేడు ప్రారంభమైంది. దేశ రాజధాని ఢీల్లీ (Delhi) ప్రగతి మైదాన్‌లోని భారత మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్(Convention Center)లో జరుగుతుంది.జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రధాన వేదికైన భారత్ మండపం అతిథుల రాకతో సందడిగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ (PMMODI) తొలుత మండపానికి చేరుకొన్నారు. ఆయనకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ ధోబాల్ (Ajit Dhobal) స్వాగతం పలికారు. సదస్సు షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.20 నుంచి 10.20 మధ్యలో విదేశీ అగ్రనేతలు చేరుకొంటారు. వీరికి ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలుకుతున్నారు.
ఆస్ట్రేలియా, కెనడా ప్రధానులు, ఐరోపా (Europe) సమాఖ్య చీఫ్ ఇప్పటికే మండపానికి చేరుకొన్నారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విదేశీ అగ్రనేతలకు స్వాగతం చెబుతూ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. ‘‘జీ20 సభ్య దేశాధినేతలకు, అతిథి దేశాలకు, అంతర్జాతీయ సంస్థలకు దిల్లీ(Delhi)లో జరుగుతున్న 18వ జీ20 సదస్సుకు స్వాగతం’’ అని పేర్కొన్నారు. జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు భారత్‌కు అగ్రనేతల రాక కొనసాగుతోంది. నేటి ఉదయం జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ (Olaf Scholz) భారత్ చేరుకొన్నారు. ఆయనకు కేంద్ర మంత్రి భాను ప్రతాప్ సింగ్ ఎదురెళ్లి స్వాగతం పలికారు.మరోవైపు, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ (Aziz Al) సౌద్ ఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన జీ20 సదస్సులోనూ పాల్గొంటారు. ఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వాగతం పలికారు.