»Ponds Adoption Minister Kt Rama Rao Launched The Lakes Development Programme
CSR Ponds చెరువుల దత్తత ప్రారంభం.. మంత్రి కేటీఆర్ అభినందన
హైదరాబాద్ అభివృద్ధికి అందరూ సహకరించాలి. విశ్వనగరం దిశగా హైదరాబాద్ అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటివరకు చేసిన అభివృద్ధి గోరంత.. చేయాల్సింది చాలా ఉంది. ’ అని పేర్కొన్నారు.
అలనాడు హైదరాబాద్ చుట్టూ అంతటా.. చెరువులు, పచ్చదనంతో నిండి ఉండేది. నగరం విస్తరిస్తోంది.. దేశం నుంచి ప్రజలు తరలివస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో చెరువులు కానరావడం లేదు. ఉన్న చెరువులు కబ్జాలో కూరుకుపోయాయి. ఈ చెరువులను బాగు చేసేందుకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (KT Rama Rao) చొరవ తీసుకున్నారు. చెరువులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి అభివృద్ధి (Development) చేయించాలని సంక్పలించారు. చెరువులను దత్తత (Ponds Adoption) ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ప్రాంతంలోని 50 చెరువులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) (Corporate Social Responsibility – CSR) కింద ఆధునీకరించనున్నారు. ఇక ప్రతి చెరువు దుర్గం చెరువు (Durgam Cheruvu) మాదిరి కానుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని (Lakes Development Programme) మంగళవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. ‘జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని చెరువులన్నింటిని అన్ని రకాల అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నాం. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను తీర్చిదిద్దాలని నిర్ణయించాం. సీఎస్ఆర్ నిధులతో జీహెచ్ఎంసీ పరిధిలోని 25, హెచ్ఎండీఏ (HMDA) పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాం’ అని తెలిపారు.
‘హైదరాబాద్ (Hyderabad)కు 440 సంవత్సరాల చరిత్ర ఉంది. నాటి నగరాన్ని కాపాడుకుంటూనే మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాం. జూలై నాటికి హైదరాబాద్ లో వంద శాతం మురుగు నీరు శుద్ధి చేస్తాం. దేశంలోనే వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే నగరంగా హైదరాబాద్ నిలుస్తుంది. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ (ORR) పరిధిలో 155 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో రియల్టర్లను భాగస్వాములను చేసి అభివృద్ధి చేస్తున్నాం’ అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రోపై కీలక ప్రకటన చేశారు. ‘మూడేళ్లలో శంషాబాద్ మెట్రో లైన్ పూర్తి చేస్తాం. లక్డీకాపూర్- బీహెచ్ఈఎల్, నాలుగో-ఎల్బీ నగర్ మార్గాల్లో మెట్రోకు కేంద్ర ప్రభుత్వం సహాయం కోరాం. కానీ కేంద్రం మొండి చేయి చూపుతోంది. హైదరాబాద్ అభివృద్ధికి అందరూ సహకరించాలి. విశ్వనగరం దిశగా హైదరాబాద్ అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటివరకు చేసిన అభివృద్ధి గోరంత.. చేయాల్సింది చాలా ఉంది. ’ అని పేర్కొన్నారు.