తెలంగాణ (Telangana) మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KT Rama Rao) విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులే (Investments) లక్ష్యంగా చేపట్టిన ఈ పర్యటన ఫలవంతంగా సాగుతోంది. ఇప్పటికే ప్రఖ్యాత సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని (Warner Bros. Discovery) హైదరాబాద్ కు తీసుకువస్తుండగా.. తాజాగా రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. వైద్య పరికరాల ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ (Global Leader)గా ఉన్న మెడ్ ట్రానిక్స్ సంస్థ తెలంగాణకు తరలిరానుంది. ఈ మేరకు ఒప్పందం జరిగింది.
ప్రపంచంలోనే వైద్య ఉత్పత్తుల (Medical Devices) అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న మెడ్ ట్రానిక్స్ (Medtronic) ప్రతినిధులు న్యూయార్క్ లో గురువారం మంత్రి కేటీఆర్ (KTR)తో సమావేశమయ్యారు. చర్చల అనంతరం తాము రూ.3 వేల కోట్లతో రాష్ట్రంలో మెడికల్ డివైజెస్ ఆర్ అండ్ డీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. అమెరికా తర్వాత మెడ్ ట్రానిక్స్ అతి పెద్ద ఆర్ అండ్ డీ (R and D) కేంద్రాన్ని హైదరాబాద్ (Hyderabad)లో ఏర్పాటు చేయడం విశేషం. ఈ ప్రకటనపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతో విదేశీ కంపెనీలు (Foreign Companies) వరుస కడుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపార. వ్యాపార అనుకూల విధానాలతో పెట్టుబడులు తరలిస్తున్నాయని చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణ మరోటి లేదని పేర్కొన్నారు.
Ecstatic to welcome one of the country’s largest investments of more than USD 350 mn (INR 3000 Cr approx) in the medical devices sector 😊
Thank you @Medtronic for choosing Hyderabad as your base, this further strengthens Telangana's position as a global hub for medical devices… pic.twitter.com/3pItimAZk1