»Nellore Mla Anil Kumar Yadav Comments About Party Changing
Jagan గెటవుట్.. గెట్ లాస్ట్ అని పంపినా సీఎంతోనే ఉంటా: మాజీ మంత్రి అనిల్
తనపేరును వాడుకుని వాళ్లు డబ్బులు సంపాదించుకుని సుఖంగా ఉంటారంటే దాన్ని కూడా స్వాగతించే వ్యక్తిని తానని చెప్పుకున్నారు. మా తండ్రి వర్ధంతి నాడు.. మా తండ్రి సాక్షిగా చెబుతున్నా.. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగనన్నతోనే నా ప్రయాణం అని స్పష్టం చేశారు.
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YCP) ఉమ్మడి నెల్లూరు జిల్లా (Nellore District) కలిసి రాలేదు. ఈ జిల్లాలో ఏకంగా ముగ్గురు సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు వ్యవహారం సంచలనం రేపిన విషయం తెలిసిందే. త్వరలోనే మరికొందరు ఇదే బాట పడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వారిలో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) కూడా ఉన్నాడు. అతడు పార్టీకి దూరంగా ఉన్నాడని.. త్వరలోనే పార్టీ మారుతాడని.. అందుకే 15 రోజుల పాటు రాష్ట్రంలో ఉండడం లేదని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ ప్రచారంపై అనిల్ స్పందించాడు.
ఎవరో కొంతమంది ఫేక్ గాళ్లు అసత్య వార్తలతో (Fake News) ప్రచారాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొట్టి పారేశాడు. తనపేరును వాడుకుని వాళ్లు డబ్బులు సంపాదించుకుని సుఖంగా ఉంటారంటే దాన్ని కూడా స్వాగతించే వ్యక్తిని తానని చెప్పుకున్నారు. మా తండ్రి వర్ధంతి నాడు.. మా తండ్రి సాక్షిగా చెబుతున్నా.. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగనన్నతోనే (Jagan) నా ప్రయాణం అని స్పష్టం చేశారు. నన్ను తరిమేసే పరిస్థితి ఏనాటికి రాదని పేర్కొన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా తుది శ్వాస వరకు జగనన్న కోసం పని చేస్తానని చెప్పారు. గొర్రెల మందలో గొర్రెగా ఉండే కంటే ఒంటరిగా సింహంలా ఉండడం మంచిదని పేర్కొన్నారు.
తాను 15 రోజుల పాటు నెల్లూరుకు దూరంగా ఉండనున్నట్లు అనిల్ తెలిపారు. మోకాలి (Knee) సమస్య కారణంగా చికిత్స కోసం 15 రోజులు ఉండడం లేదని చెప్పారు. మీడియా దానిని వక్రీకరించి అనిల్ జగన్ కు దూరమవుతున్నాడని అబద్ధపు ప్రచారం మొదలుపెట్టిందని మండిపడ్డారు. 15 రోజుల చికిత్స అనంతరం మళ్లీ ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. సీఎం జగన్ తనను గెటవుట్.. గెట్ లాస్ట్ అని చెప్పినా కూడా తాను జగన్ కు ఫాలోవర్ గా ఉంటానని అనిల్ పేర్కొన్నారు.