»Telangana Warner Bros Discovery Selects Hyderabad For Idc Kt Rama Rao Welcomed
Telanganaకు రానున్న అంతర్జాతీయ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ
ఈ ప్రకటన తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీ విషయమై ఆరా తీయడం మొదలైంది. వార్నర్ బ్రదర్స్ సంస్థ వస్తే అంతర్జాతీయ సినిమాలు కూడా మన హైదరాబాద్ కేంద్రంగా పనులు జరిగే అవకాశం ఉంది.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన మీడియా సంస్థ, అంతర్జాతీయ వినోద దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (Warner Bros. Discovery) కంపెనీ తెలంగాణలో (Telangana) అడుగుపెట్టబోతున్నది. పొగో (Pogo), కార్టూన్ నెట్ వర్క్ (Cartoon Network), హెచ్ బీఓ (HBO), సీఎన్ఎన్ (CNN) వంటి దిగ్గజ చానల్స్ నిర్వహిస్తున్న ఈ సంస్థ హైదరాబాద్ లో (Hyderabad) తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ (KT Rama Rao)తో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. న్యూయార్క్ లో తెలంగాణ ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందంగా కుదుర్చుకుంది. కేంద్రం ఏర్పాటుతో 1,200 మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
వారం రోజులుగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రతిష్టాత్మక సదస్సుల్లో పాల్గొంటూనే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అంతర్జాతీయ సంస్థలు, కంపెనీలతో మంత్రి కేటీఆర్ బృందం సమావేశమవుతోంది. ఈ పర్యటన విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే న్యూయార్క్ (New York)లో వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఆర్థిక విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలెగ్జాండ్ర కార్టర్ (Alexandra Carter) మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. మీడియా, వినోద రంగంలో హైదరాబాద్ లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు కార్టర్ తెలిపారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం (ఐడీసీ)ని (International Development Centre – IDC) ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కేంద్రం ద్వారా భారతీయ మార్కెట్ లోకి తాము అడుగుపెట్టబోతున్న కార్టర్ వెల్లడించారు. ఈ కేంద్రం ద్వారా 1,200 మందికి ఉపాధి అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.
ఆమె ప్రకటనను మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ తెలంగాణలో అడుగుపెట్టబోతుండడంపై హర్షం వ్యక్తం చేశారు. సంపూర్ణ సహకారం అందిస్తామని అలెగ్జాండ్ర కార్టర్ కు తెలిపారు. కాగా ఈ ప్రకటన తెలంగాణలో ఆసక్తికరంగా మారింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీ విషయమై ఆరా తీయడం మొదలైంది. హెచ్ బీఓ, హెచ్ బీఓ మ్యాక్స్, సీఎన్ఎన్, టీసీఎల్, డిస్కవరీ, డిస్కవరీ ప్లస్, డబ్ల్యూబీ, యూరో స్పోర్ట్, యానిమల్ ప్లానెట్, కార్టూన్ నెట్ వర్క్, సినీ మ్యాక్స్, పొగో, టూన్ కార్ట్, హెచ్ జీటీవీ, క్వెస్ట్ తదితర ప్రపంచ ప్రఖ్యాతి పొందిన టీవీ చానళ్లు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ కంపెనీకి చెందినవే. ఈ సంస్థ తెలంగాణకు రానుండడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే భారతదేశంలోనే సినీ పరిశ్రమకు (Movie Industry) హైదరాబాద్ ప్రధాన కేంద్రం వర్ధిల్లుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశ సినిమాలన్నీ తెలంగాణ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఇక వార్నర్ బ్రదర్స్ సంస్థ వస్తే అంతర్జాతీయ సినిమాలు కూడా మన హైదరాబాద్ కేంద్రంగా పనులు జరిగే అవకాశం ఉంది.
Thrilled to announce the grand entry of global media powerhouse "Warner Bros. Discovery" into the entertainment realm of Telangana!
Hyderabad is set to witness the launch of their incredible IDC, a hub of creativity and innovation, with a whopping 1200 employees in the first… pic.twitter.com/z5hAj5kBNs