దొంగలు ప్రముఖుల (VIPs) ఇల్లే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినీ నటీనటుల, సినీ పరిశ్రమకు (Movie Industry) చెందిన వారి ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారు. గతంలో హీరోయిన్ సోనమ్ కపూర్, రజనీకాంత్ కుమార్తె, ఐశ్వర్య తదితరుల ఇళ్లల్లో దొంగతనాలు జరగ్గా.. తాజాగా బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) చెల్లెలు అర్పితా ఖాన్ (Arpita Khan) నివాసంలో దొంగతనం జరిగింది. విలువైన ఆభరణాలు (Ornaments) మాయమయ్యాయి. అయితే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దొంగను (Theif) పట్టుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ముంబైలోని (Mumbai) ఖార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్పితా ఖాన్ నివసిస్తోంది. తన నివాసంలో రూ.5 లక్షల విలువైన వజ్రాలతో పొదిగిన చెవి రింగులు (Ear Rings) చోరీకి గురయ్యాయని అర్పితా మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన ఖార్ పోలీసులు (Khar Police) ఇంట్లో పని చేసే 11 మంది పని మనుషులపై (Workers) అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ సమయంలో ఇంట్లో పని చేసే అందరినీ విచారిస్తుండగా సందీప్ హెగ్డే (30) (Sandip Hegde) కనిపించలేదు. దొంగతనం జరిగిన నాటి నుంచి కనిపించకపోవడంతో సందీప్ పైనే అనుమానం వ్యక్తం చేశారు. అతడిని వెతికి పట్టుకోగా ఈ చోరీకి పాల్పడింది అతడేనని తేలింది. నాలుగు నెలల కిందట అర్పితా ఇంట్లో పనికి కుదిరాడు. నమ్మకంగా పని చేస్తున్న సందీప్ ఇటీవల అర్పిత గదిలో ఉన్న చెవి రింగులు దొంగతనం చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని చెరి రింగులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా నటుడు ఆయూశ్ శర్మను (Aayush Sharma) 18 నవంబర్ 2014న అర్పితా వివాహం చేసుకుంది. హైదరాబాద్ (Hyderabad)లోని ఫలక్ నుమ ప్యాలెస్ (Falaknuma Palace)లో అంగరంగ వైభవంగా జరిగింది. అర్పిత, ఆయూశ్ కు ఇద్దరు పిల్లలు. కాగా అర్పితా కాన్ సల్మాన్ సొంత చెల్లెలు కాదు. ఆమెను దత్తత తీసుకున్నాాడు.