»Summer Maximum Temperatures Likely To Rise By 2 3 Degrees In Telangana
Telanganaకు తీవ్ర హెచ్చరిక.. మరో 2 వారాలు నిప్పుల కొలిమి
ఇటీవల వచ్చిన అకాల వర్షాలతో ఉపశమనం పొందిన ప్రజలకు ఇప్పుడు సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణ నిప్పుల కొలిమిగా మారింది. ఈ వేడిమి తట్టుకోలేక ఒక్క రోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు.
గతంలో ఎన్నడు లేనట్టు భానుడు (Sun) భగభగమంటున్నాడు. వేసవి కాలం (Summer) తెలుగు రాష్ట్రాల్లో ముచ్చెమటలు పట్టిస్తోంది. రోజురోజుకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అత్యధికంగా 44.8 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత (Temperature) మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ (Meteorological Department -MD) వెల్లడించింది. మరో రెండు వారాల పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 31వ తేదీ వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో (Telangana) భానుడు ప్రచండం (Heat Wave) చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పగటి పూటనే కాదు రాత్రిళ్లు కూడా వాతావరణం వేడిగా ఉంటోంది. ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇటీవల వచ్చిన అకాల వర్షాలతో ఉపశమనం పొందిన ప్రజలకు ఇప్పుడు సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణ నిప్పుల కొలిమిగా మారింది. ఈ వేడిమి తట్టుకోలేక ఒక్క రోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు. నల్లగొండ జిల్లాలో తీవ్రమైన ఎండలు వ్యాపిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రత 40కి పైగా నమోదవుతోంది.
మరో రెండు వారాల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న (Dr Nagaratna) ప్రకటించారు. ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు 2 నుంచి 3 డిగ్రీల పెరుగుదల ఉంటుందని వెల్లడించారు. వేడి వాతావరణం.. పొడి గాలులు వీస్తాయని వివరించారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య అత్యధిక వేడి ఉంటుందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప పగటి పూట ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. కాగా ఉష్ణోగ్రతలు రోజురోజుకు తీవ్రమవుతుండడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. బయటకు రాలేక.. ఇళ్లల్లో ఉండలేక అల్లాడుతున్నారు. ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నారు. పగటి పూట ఒక్కటే కాదు రాత్రిళ్లు కూడా వేడి వాతావరణం ఉంటోంది.