Gowtham Ghattamaneni : మహేష్ బాబు తనయుడు గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. వన్ నేనొక్కడ్నే సినిమాలో గౌతమ్ చిన్నతనంలో మహేష్ క్యారెక్టర్లో నటించాడు. తన చెల్లి సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. కానీ గౌతమ్ సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉంటాడు. అయితే, మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ అతడి గురించి సంతోషకరమైన కథనాన్ని పోస్ట్ చేసింది. గౌతమ్ తన కొడుకుతో కారులో దిగిన సెల్ఫీని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఆ తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీ (NYU)లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడని పేర్కొంది. గౌతమ్ ఇటీవలే లండన్లో ప్లస్ 2 పూర్తి చేశాడు. ఈ సందర్భంగా తన కొడుకు యూనివర్సిటీలో సీటు సంపాదించడం గురించి ఆమె చేసిన పోస్టులో ఇలా రాసుకొచ్చింది.. నీ హార్డ్ వర్క్, ప్యాషన్, సంకల్పం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. అవే నీకు ఇవాళ ఈ రోజుని తీసుకొచ్చాయి. నువ్వు మరింత ఎదగాలి అంటూ తన కొడుకుకి ప్రేమతో లవ్ యు చెప్తూ విష్ చేసింది నమ్రత. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. గౌతమ్ న్యూయార్క్ యూనివర్సిటీలో ఏం చదువుకోవడానికి వెళ్తున్నాడో అని అభిమానులు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ గౌతమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.