New York: అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ వేళ న్యూయార్క్ వీధుల్లో రామనామాన్ని జపిస్తున్నారు. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మార్మోగుతుంది. మన సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రవాస భారతీయులు భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. టైమ్స్ స్క్వేర్ ఓ జంక్షన్ దగ్గర రాముడి చిత్రాలను పదర్శించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్‌లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. టైమ్స్ స్క్వేర్ ప్రాంతానికి ప్రవాస భారతీయులు చేరుకుని.. సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు పట్టుకుని వేడుకలు చేసుకుంటున్నారు. కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండే భారతీయులు కూడా అయోధ్య ప్రారంభోత్స వేడుకలను జరుపుకుంటున్నారు.
మధ్యాహ్నం 12:29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల సమయంలో ప్రధాని మోదీ ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. విగ్రహ కళ్లకు ఉన్న వస్త్రాన్ని తొలగించి.. బంగారంతో చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దుతారు. కాటుక దిద్దిన తర్వాత రామ్‌లల్లాకు చిన్న అద్దాన్ని చూపించి.. 108 దీపాలతో మహాహారతి ఇవ్వడంతో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగుస్తుంది.