Mahesh Babu: ఓర్ని.. మహేష్ బాబు కొడుకు న్యూయార్క్ వెళ్లింది అందుకా?
తమ అభిమాన హీరోల వారసులు.. ఎప్పుడెప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందులో మహేష్ బాబు కొడుకు కూడా ఉన్నాడు. తాజాగా నమ్రత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతానికి బాలయ్య, పవన్ కళ్యాణ్, రవితేజ, మహేష్ వారసులు తెరంగేట్రానికి రెడీగా ఉన్నారు. కాస్త లేట్ అయినా కూడా.. వీళ్లు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం. అయితే ఘట్టమనేని అభిమానులు మాత్రం గౌతమ్ ఎంట్రీ ఎప్పుడుంటుంది? అని తరచుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తునే ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తనయుడు గౌతమ్ లండన్‌లో చదువుకుంటున్నాడు. కానీ తండ్రికి తగ్గ తనయుడిగా.. 8 ఏళ్ల వయసులోనే ‘వన్ నేనొక్కడినే’ చిత్రంలో నటించాడు గౌతమ్. మహేష్, గౌతమ్‌ను బిగ్ స్క్రీన్ పై చూసి మురిసిపోయారు అభిమానులు. కానీ ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు గౌతమ్.
ప్రస్తుతం స్టడీస్ పైనే గౌతమ్ దృష్టి ఉంది. అయితే.. ఆ మధ్య తన స్నేహితులతో కలిసి గౌతమ్ చేసిన ఫస్ట్ థియేటర్ ప్రొడక్షన్ వీడియోని నమ్రత శిరోద్కర్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు గౌతమ్ చిన్న నాటి ఫోటోని షేర్ చేసి.. మరో హింట్ ఇచ్చింది. గౌతమ్ కేవలం చదువుల కోసమే లండన్ వెళ్లలేదు.. యాక్టింగ్ కూడా నేర్చుకున్నట్టుగా ఓ పోస్ట్ చేసింది.స్లేట్‌పై రాయడం నుండి వేదికపై స్క్రిప్ట్‌ల వరకు. కలలు మరియు సంకల్పానికి అందమైన కాంబినేషన్. జీవితం, స్పాట్‌లైట్‌ని స్వీకరించడానికి ఒక ఫుల్ సర్కిల్ పట్టింది.
ఈ అద్భుతమైన ప్రయాణంలో మీకు ఆనందం మరియు విజయం మాత్రమే రావాలని నేను కోరుకుంటున్నాను.. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.. అని రాసుకొచ్చింది. దీంతో చదువుతో పాటు.. నటన కూడా నేర్చుకోవడానికి లండన్ వెళ్ళాడు. అందుకే ఆ పిక్ షేర్ చేసింది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి గౌతమ్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.