»Hyderabad Telangana Minister Talasani Srinivas Yadav Fire On Revanth And Bjp
Revanth Reddyని పిస్కితే ప్రాణం పోతది: మంత్రి తలసాని తీవ్ర వ్యాఖ్యలు
కాంగ్రెస్ యువజన సంఘర్షణ సభలో మాట్లాడిన రేవంత్, ప్రియాంక వ్యాఖ్యలపై స్పందించారు. ‘పొట్టోడు రేవంత్ డిక్లరేషన్ మాట్లాడుతున్నాడు. వాడి నోటికి అదుపే లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు లేదు కానీ వాడు వీడు అని మాట్లాడుతాడు. ఆ పొట్టోడు రేవంత్ ది పిసికితే ప్రాణం పోతది.
శ్రుతిమించి సీఎం కేసీఆర్ (KCR)పై, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్ ది పిసికితే పోయే ప్రాణం’ అని తెలిపారు. హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో తలసాని మాట్లాడారు. బీజేపీని బండ బూతులు తిట్టారు.
హైదరాబాద్ బేగంపేటలో (Begumpet) నిర్మించి అత్యాధునిక వైకుంఠధామాన్ని (Cremation Yard) మంగళవారం మంత్రి కేటీఆర్ (KT Rama Rao)తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ యువజన సంఘర్షణ సభలో మాట్లాడిన రేవంత్, ప్రియాంక వ్యాఖ్యలపై స్పందించారు. ‘పొట్టోడు రేవంత్ డిక్లరేషన్ మాట్లాడుతున్నాడు. వాడి నోటికి అదుపే లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు లేదు కానీ వాడు వీడు అని మాట్లాడుతాడు. ఆ పొట్టోడు రేవంత్ ది పిసికితే ప్రాణం పోతది’ అని తలసాని తెలిపారు. ‘40 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలన చేసిన కాంగ్రెస్ ఏం చేసింది? పింఛన్ పెంపు, విద్యుత్, ఇంటింటికి తాగడానికి నీళ్లు వంటి ఆలోచనలు మీకు ఎందుకు రాలేదు’ అని నిలదీశారు. ‘బీజేపీ, ప్రధాని మోదీకి నాకు బొట్టు పెట్టడం నేర్పుతారా?’ అని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాత సచివాలయం (Secretariat) కూల్చి కొత్తది కడుతామంటే చాలా మంది లొల్లి పెట్టి కేసులు వేశారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ సచివాలయం చూసేందుకు వస్తున్నారు. అమెరికాలో వైట్ హౌజ్ మాదిరి తెలంగాణలో మన సచివాలయం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులకు కారణం గత ప్రభుత్వాలేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (KTR) సహకారంతో హైదరాబాద్ లో సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు.