మత కలహాలు, అల్లర్లు రేపుతున్న ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాను పశ్చిమ బెంగాల్ (West Bengal), తమిళనాడు (Tamil Nadu), కేరళ (Kerala) రాష్ట్రాలు నిషేధం విధించాయి. సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లలో (Theatre) గొడవలు జరుగుతున్నాయి. ఆ వివాదాస్పద సినిమా తీసిన దర్శకుడు సుదీప్తో సేన్ (Sudipto Sen), ఆ సినిమా నిర్మాణ సంస్థ ప్రతినిధికి తాజాగా బెదిరింపులు (Threat) వచ్చాయి. దీంతో వారు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ సినిమా దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం రేపింది. ఇంటి నుంచి బయటకు రావొద్దని దర్శకుడు సుదీప్తో సేన్ కు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫోన్లు (Phone), సందేశాలతో (Messages) బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా వారి ఆచూకీ మాత్రం లభించలేదు. బెదిరింపులు రావడంతో వెంటనే ముంబై పోలీసులను (Mumbai Police) సేన్ ఆశ్రయించారు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు సేన్ కు భద్రత కల్పించారు. ‘నా సినిమా బృందంలోని ఇద్దరికి సోషల్ మీడియాలో బెదిరింపు సందేశాలు, ఫోన్లు వచ్చాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాం. వారు వెంటనే స్పందించి మాకు భద్రత కల్పించారు’ అని సుదీప్తో సేన్ తెలిపాడు.