»Telangana Poet And Singer Gaddar Will Be Launch New Political Party Within One Month
Gaddar తెలంగాణలో మరో కొత్త పార్టీ.. నెల రోజుల్లో స్థాపనకు ప్రజా గాయకుడు సిద్ధం
నెల రోజుల్లో కొత్త రాజకీయ పార్టీని పెడతానని ప్రకటించారు. లక్ష మంది కళాకారులు, జర్నలిస్టులతో చర్చించి పేరు నిర్ణయిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని మరోసారి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణలో (Telangana) పరిణామాలు రోజురోజుకు మారుతున్నాయి. రాజకీయ వాతావరణం (Political) పూర్తిగా వేడెక్కింది. ఎన్నికల్లో సత్తా చాటేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. ఇక పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక కొందరేమో కొత్త పార్టీలు స్థాపించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ప్రజా గాయకుడు ప్రజా యుద్ధనౌకగా పేరు పొందిన గద్దర్ (Gaddar) కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ (KCR)కు వ్యతిరేకంగా తాను బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ (Hyderabad) లోని సరూర్ నగర్ మైదానంలో సోమవారం నిర్వహించిన ‘యువ సంఘర్షణ సభ’కు గద్దర్ హాజరయ్యారు. గద్దర్ నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Activities) నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా పలుకరించగా గద్దర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నెల రోజుల్లో కొత్త రాజకీయ పార్టీని (New Political Party) పెడతానని ప్రకటించారు. లక్ష మంది కళాకారులు, జర్నలిస్టులతో (Journalists) చర్చించి పేరు నిర్ణయిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని మరోసారి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ విషయమై మాట్లాడుతూ.. ఈ దేశంలో లిబరల్, అభ్యుదయ పార్టీ కాంగ్రెస్ అని గద్దర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావాలని కోరుతున్నట్లు చెప్పారు. కేసీఆర్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని, ఆయనపై ధర్మయుద్ధం చేస్తానని తెలిపారు. కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తానన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని నాశనం చేసి సనాతనం పేరుతో ఒక ఫాసిజ ప్రభుత్వం మోదీది (Modi) అని విమర్శించారు. భారతదేశాన్ని రక్షించుకోవాలనే ఆకాంక్షతో అన్ని పార్టీలకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. పదేళ్ల నుంచి కేసీఆర్ పేదలు, విద్యార్థుల కన్నీళ్లు తుడవడంలో విఫలమయ్యారని విమర్శించారు.