»Ap Minister Karumuri Venkata Nageswara Rao Once Again Fire On Farmers In Eluru District
Karumuri నిన్న ఎర్రిపప్ప.. నేడు నోర్మూసుకో.. రెచ్చిపోతున్న ఏపీ మంత్రి కారుమూరి
సీఎం జగన్ (YS Jagan)పై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం వచ్చిన మంత్రితో రైతులు తమ గోడు వినిపించుకున్నారు. రైతులు (Farmers) పదే పదే తమ ప్రభుత్వంపై విమర్శించడంతో కారుమూరి సహించకుకోలేకపోయాడు. ఆ సమయంలో ఓ రైతును ‘ఏయ్ నోరు మూసుకో’ అని దుర్భాషలాడాడు.
అధికారం ఉంది కదా అని ఏపీలోని మంత్రులు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు రెచ్చిపోతున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. నిలదీస్తే ఎదురుదాడికి దిగుతున్నారు.. లేదంటే భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇక ప్రజలు తిరగబడితే పోలీసుల సహకారంతో పారిపోతారు. ఇలాంటి పరిణామాలు ఏపీలో ఎక్కడో ఒకచోట జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ పౌరసఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వర రావు (Karumuri Venkata Nageswara Rao) మరోసారి రెచ్చిపోయారు. ధాన్యం కొనమంటే నానా హడావుడి చేశారు.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు మంత్రి కారుమూరి ఏలూరు జిల్లాలో (Eluru District) పర్యటిస్తున్నారు. ఈ సమయంలో మొన్న రైతును ‘ఎర్రిపప్ప’ అని విమర్శించారు. తాజాగా నిన్న సోమవారం తనను నిలదీసిన రైతులపై రెచ్చిపోయారు. తన దౌర్జన్యం ప్రదర్శించారు. ఉంగుటూరు, నాచారం గ్రామాల్లో పర్యటిస్తున్న రైతులు సీఎం జగన్ (YS Jagan)పై తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం వచ్చిన మంత్రితో రైతులు తమ గోడు వినిపించుకున్నారు. రైతులు (Farmers) పదే పదే తమ ప్రభుత్వంపై విమర్శించడంతో కారుమూరి సహించకుకోలేకపోయాడు. ఆ సమయంలో ఓ రైతును ‘ఏయ్ నోరు మూసుకో’ అని దుర్భాషలాడాడు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది వీడియో తీస్తున్న జర్నలిస్టులపై కూడా మంత్రి హెచ్చరికలు జారీ చేశారు. ఫొటోలు, వీడియోలు తీయొద్దని బలవంతం చేశారు. కెమెరాలు లాక్కోవడానికి ప్రయత్నించారు.