»Cm Jagan Has Released Input Subsidy Funds For Farmers
YS Jagan : రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసిన సీఎం జగన్
ఏపీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఖరీఫ్–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు.. రబీ సీజన్ ఆరంభంలో గత డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారాన్ని జగన్ ప్రభుత్వం విడుదల చేసింది.
YS Jagan : ఏపీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అందువల్ల ఖరీఫ్–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు.. రబీ సీజన్ ఆరంభంలో గత డిసెంబర్లో సంభవించిన మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారాన్ని జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో బటన్ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా రైతులకు అండగా ఉంటున్నామన్నారు. సచివాలయ పరిధిలో పంటనష్టపోయిన రైతుల పూర్తి జాబితా ఉంటుందన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా రైతులకు పరిహారం ఇస్తున్నామన్నారు. రైతులకు నష్టం కలగకుండా రంగు మారినప్పటికీ ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఖరీఫ్ 2023లో 103 మండలాలను కరువు మండలాలను ప్రకటించి.. ఆయా మండలాల పరిధిలో 14.24 లక్షల ఎకరాల్లో 33 శాతం కంటే ఎక్కువగా పంటలు కోల్పోయిన 6,59,897 మంది రైతులకు రూ. 847.22 కోట్ల పెట్టుబడి రాయితీని అందిస్తున్నామన్నారు.
. మేలో కురిసిన అకాల వర్షాల వల్ల ఐదు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 1,892 మంది రైతులకు రూ.ఐదే కోట్లు కోత అనంతరం పంట నష్టపరిహారం ఇస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు, గాలుల వల్ల జరిగిన పంట నష్టంతో పాటు నేల కోత, ఇసుక మేటలు కారణంగా నష్టపోయిన 4.61లక్షల మంది రైతులకు రూ. 442.36 కోట్ల పెట్టుబడి రాయితీని ఇస్తున్నట్లు సీఎం జగన్ చెప్పుకొచ్చారు. తాజాగా జమ చేసిన ఇన్పుట్ సబ్సిడీతో కలిపి ఈ ఐదేళ్లలో 34.41 లక్షల మంది రైతులకు రూ. 3,261.60 కోట్లు పెట్టుబడి రాయితీని వైసీపీ ప్రభుత్వం అందించింది. ఈ 57 నెలల్లో పెట్టుబడి రాయితీ కింద 22.82 లక్షల వ్యవసాయ, ఉద్యాన, పట్టు రైతుల ఖాతాలకు రూ. 1,967.02 కోట్లు నేరుగా సీఎం జగన్ జమ చేశారు.