Sharwanand: ఒక్కరోజే మూడు సినిమాలు.. శర్వానంద్ తగ్గేదేలే!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. చివరగా శర్వానంద్ నటించిన 'ఒకే ఒక జీవితం' జస్ట్ ఓకె అనిపించింది. కానీ అంతకుముందు వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో మంచి హిట్ కోసం చూస్తున్న శర్వా.. ఒకే రోజు మూడు సినిమాల అప్డేట్ ఇచ్చాడు.
Sharwanand: శర్వానంద్‌కు పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకరం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి సినిమాలు ఏ మాత్రం హిట్ ఇవ్వలేకపోయాయి. కానీ ఆ తర్వాత చేసిన ‘ఒక ఒక జీవితం’ సినిమాతో మాత్రం పర్వాలేదని అనిపించుకున్నాడు. అలాగే.. ఇటీవలె రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు శర్వానంద్. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. శర్వానంద్ కెరీర్లో 35వ సినిమాగా సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా టైటిల్‌ను లేటెస్ట్గా అనౌన్స్ చేశారు.
మార్చి 6న శర్వానంద్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు ‘మనమే’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇక శర్వానంద్ 36వ సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. యంగ్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే.. మంచి థ్రిల్ రైడ్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుండగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక శర్వానంద్ బర్త్ డేకి రెండే అప్టేట్స్ అనుకుంటే.. మూడో సినిమా అప్డేట్ కూడా ఇచ్చాడు. 37వ సినిమాను కూడా ప్రకటించాడు. గతేడాది సామజవరాగమనా సినిమాతో హిట్ కొట్టిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఏదేమైనా.. ఒక్క రోజునే శర్వానంద్ మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడంతో.. ఇక పై తగ్గేదేలే అంటున్నాడని చెప్పొచ్చు.