ఈ సమ్మర్లో వస్తున్న ఏకైక పాన్ ఇండియా సినిమా ఏదైనా ఉందా? అంటే, అది ప్రభాస్ నటిస్తున్న కల్కినే. అయితే.. మరో రెండు నెలల్లో రిలీజ్ పెట్టుకొని, ఇంకా ఆట పాట అంటున్నారు చిత్ర యూనిట్. తాజాగా సాంగ్ షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.
Kalki: మరో రెండు నెలల్లో ప్రభాస్ నటిస్తున్న కల్కి2898ఏడి మూవీ రిలీజ్ కానుంది. అయినా కూడా ఇప్పటికీ షూటింగ్ చేస్తునే ఉంది చిత్ర యూనిట్. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాల్సింది పోయి.. విదేశాల్లో షూటింగ్ అంటు సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ప్రభాస్, దిశా పటానీలపై బ్యూటీఫుల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. లేటెస్ట్గా ఇదే విషయాన్ని చెబుతూ.. కల్కి టోటల్ కాస్ట్ అండ్ క్రూ దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రొడక్షన్ హౌజ్ వైజయంతీ బ్యానర్.
ఇటలీలో ఆట పాటకు వెళ్తున్నామంటూ.. దిగిన ఫోటోని షేర్ చేశారు. ఈ సడన్ సర్ప్రైజ్ ఫోటోలో ప్రభాస్తో పాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్, హీరోయిన్ దిశా పటానీ కూడా ఉన్నారు. అయితే.. ప్రభాస్ నుంచి ఒక సోలో ఫోటో రిలీజ్ చేస్తే బాగుండేదని డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మార్చి 8న ఏదైనా సాలిడ్ అప్డేట్ ఏమైనా ఉంటుందా? అని వెయిట్ చేస్తున్నారు. కానీ రిలీజ్ టైం దగ్గర పడుతుంటే.. ఇంకా ఆట పాట ఏంది సామి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే.. ఈ సాంగ్తో పార్ట్ 1 షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని అంటున్నారు.
మే 9న కల్కి మూవీని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. థియేటర్లోనే కల్కి సెకండ్ పార్ట్ అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్గా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.