»Rewa Navneet Singh Thakur Will Play In Mumbai Ispl Cricket League Akshay Kumar Team
ISPL Cricket League : ముంబై వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్
ముంబై వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ జరగబోతుంది. IPL తరహాలో టీ-10 టెన్నిస్ బాల్ తో ఈ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. వీధుల్లో టెన్నిస్ బాల్‌తో ఆడే ఆటగాళ్లతో మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు.
ISPL Cricket League : ముంబై వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ జరగబోతుంది. IPL తరహాలో టీ-10 టెన్నిస్ బాల్ తో ఈ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. వీధుల్లో టెన్నిస్ బాల్‌తో ఆడే ఆటగాళ్లతో మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు. లీగ్‌లో తలపడుతున్న 6 టీమ్‌లకు చెందిన 96 మంది ప్లేయర్లు పాల్గొంటారు. హీరో రామ్‌చరణ్ హైదరాబాద్ టీమ్‌ని సొంతం చేసుకున్నారు. లీగ్‌లో అక్షయ్‌కుమార్ (శ్రీనగర్), హృతిక్ రోషన్ (బెంగళూరు) అమితాబ్ బచ్చన్(ముంబై), సూర్య (చెన్నై), సైఫ్అలీఖాన్ (కోల్కత్తా) దక్కించుకున్నారు. IPL తరహాలో వేలం ద్వారా క్రీడాకారులను టీమ్స్ దక్కించుకున్నాయి.
ఈ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ లీగ్‌ను BCCI పర్యవేక్షణలో క్రికెటర్లు సచిన్ టెండూల్క, రవిశాస్త్రి ముంబైలో నిర్వహిస్తున్నారు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మార్చి 6న ముంబైలోని థానేలో ఉన్న క్రికెట్ స్టేడియంలో నిర్వహించబడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 6న ముంబైలోని థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ శ్రీనగర్‌కు చెందిన వీర్, మాఝీ ముంబై మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీనగర్‌కు చెందిన అక్షయ్ కుమార్ జట్టు వీర్‌పై రేవాకు చెందిన నవనీత్ సింగ్ ఠాకూర్ రంగంలోకి దిగనున్నాడు. భారత్‌లో తొలిసారిగా ఈ లీగ్ జరుగుతోంది. మార్చి 6 నుంచి లీగ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. వీటి లైవ్ మ్యాచ్‌లు సోనీ లైవ్ టీవీ ఛానెల్లో ప్రసారం కానున్నాయి.