»Nia A Reward Of Rs 10 Lakh For The Whereabouts Of The Accused
NIA: నిందితుడి ఆచూకీ చెబితే రూ.10లక్షల రివార్డు
బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. నిందితుడి ఫొటోను విడుదల చేసి.. అతని ఆచూకీ చెప్పిన వాళ్లకి రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించింది.
NIA: బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. నిందితుడి ఫొటోను విడుదల చేసి.. అతని ఆచూకీ చెప్పిన వాళ్లకి రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించింది. సమాచారం చెప్పిన వాళ్ల వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు ఘటన అందరిని భయానికి గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కేసులో నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు. నిందితుడు ఏ మార్గంలో కేఫ్‌లోకి వచ్చాడు.
బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేఫ్‌లో అతను అనుమానాస్పదంగా తిరుగుతూ ఇడ్లీ తిన్న వ్యక్తి చిత్రాలను సీసీ కెమెరా ద్వారా పోలీసులు విడుదల చేశారు. దీనికోసం అయిదు కిలోమీటర్ల పరిధిలోని 300 సీసీ కెమెరాల చిత్రాలను విశ్లేషించారు. తెల్లటోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకుని, నల్లబూట్లు, అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. టైమర్ బాంబు సంచి ఉంచే వేళ చేతికి గ్లవ్స్ ధరించి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.