‘పుష్ప 2’ విడుదలై నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘పుష్ప మా జీవితంలో ఐదేళ్లపాటు సాగిన మరువలేని ప్రయాణంగా నిలిచింది. ఈ మూవీపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం మాలో మరింత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఒక అద్భుతంగా మార్చిన ప్రతిఒక్కరికీ మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటాం. ఇంత గొప్ప టీంతో పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం’ అని అన్నాడు.