MBNR: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి నారాయణమ్మ సతీష్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ప్రజలు ఓటు వేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు.