GNTR: సచివాలయం నుంచి జరిగిన వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, ఎరువుల లభ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంటూరు నుంచి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ సమావేశంలో పాల్గొన్నారు.