మెదక్ జిల్లా సైన్స్ ఫెయిర్లో నవాబుపేట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు రైతుల సమస్యలపై రూపొందించిన ప్రదర్శన ఆకట్టుకుంది. పంట కోత అనంతరం రోడ్లపై ధాన్యం ఆరబెట్టడానికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ధాన్యాన్ని ఆరబెట్టడం, ఎత్తడం, కుప్పలు చేయడంలో ఒకే వ్యక్తి ఉపయోగించే సులభమైన యంత్రాన్ని ప్రదర్శించారు.