మావోయిస్టు హిడ్మా సహా 13 మందిని పట్టుకుని హత్య చేశారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. హత్యలను కప్పిపుచ్చుకునేందుకు మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లు అంటూ కట్టుకథ అల్లారని ఆరోపించారు. హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్ అని విమర్శిస్తూ వికల్ప్ పేరుతో లేఖను విడుదల చేశారు.