ADB: స్థానిక ఎన్నికల నేపథ్యంలో గులాబీ పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది. బోథ్ మండల కేంద్రానికి చెందిన హమాలి కూలీలతో పాటు 50 మంది యువకులు శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.